ఒమిక్రాన్ అలర్ట్: ఫిబ్రవరీలో పీక్, మార్చి నుంచి తగ్గుముఖం.. ఐఐటీ ప్రొఫెసర్ల లెక్క ఇదీ..

ఒమిక్రాన్ వేరియంట్ గజ గజ మనిపిస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కానీ నిపుణులు మాత్రం అబ్బే అదేం లేదు అని చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్క బ్రిటన్‌లోనే 12 మంది చనిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీని గురించి శాస్త్రవేత్తలు మరో కొత్త విషయం తెలిపారు. అదే ఇదీ ఫిబ్రవరీలో పీక్‌కు చేరుకుంటుందట.. ఇదే విషయాన్ని వారు రివీల్ చేశారు. అయితే మార్చిలో తగ్గుతుందని చెప్పడం కాస్త ఊరట కలిగించే అంశంగా మారింది.

ఫిబ్రవరిలో లక్షన్నర నుంచి లక్ష 80 వేల వరకు కేసులు ఉండే అవకాశం ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌కి చెందిన సైంటిస్ట్ మహీంద్ర అగర్వాల్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన సైంటిస్ట్ ఎం విద్యాసాగర్ అంచనా వేశారు. సో అందుకనే ఇమ్యునిటీ కంపల్సరీ అని చెప్పారు. లేదంటే ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని వివరించారు.

 Omicron likely to peak in Feb 2022 but subside by its next month:scientists

సౌతాఫ్రికాలో వేరియంట్ ఎంత వేగంగా వ్యాపించిన విషయాన్ని మహీంద్ర తెలియజేశారు. ఇప్పుడు ఆ దేశంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ 23 వేల కేసులు వచ్చాయని.. తర్వాత 20 వేల వరకు పడిపోయాయని చెప్పారు. మృతుల సంఖ్య ఇప్పటికీ డబుల్ డిజిట్ వరకే ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో అమెరికా నిలుస్తోంది.

ఇటు 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్‌లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ రకం కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ సోకిన ఒకరు చనిపోయారు. దీంతో అమెరికా సహా అన్నీ దేశాలు భయపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+