వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధియాల మధ్య సవాల్: ఎంపీలో ‘ఉప’ పోరు చౌహాన్‌కూ ప్రతిష్ఠే

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సింధియా రాజ వంశీయుల కోట 'గుణ'లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. శివ్ పురి జిల్లాలోని కొలారస్, అశోక్ నగర్ జిల్లాలోని ముంగావోలీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా జ్యోతిరాదిత్య సింధియాను ప్రకటించాలా? లేదా? అన్న సంగతి తేల్చడానికి ఈ ఉప ఎన్నికలు కీలకం కానున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు పలు అంశాలను తేల్చనున్నాయి.

 ఈ రెండు స్థానాలూ జ్యోతిరాదిత్య సింధియా ‘గుణ' పరిధిలోవే

ఈ రెండు స్థానాలూ జ్యోతిరాదిత్య సింధియా ‘గుణ' పరిధిలోవే

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ పార్టీ నుంచి సవాల్ విసురుతున్న జ్యోతిరాదిత్య సింధియా రాజకీయ భవితవ్యానికి ఇవి ఉప ఎన్నికలు లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. అంతేకాదు జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గుణ' పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకే ఈ అసెంబ్లీ స్థానాలు వస్తాయి.

 సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జ్యోతిరాదిత్య డిమాండ్

సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జ్యోతిరాదిత్య డిమాండ్

కాంగ్రెస్ పార్టీ పరిధిలో తనకు తాను నాయకుడిగా జ్యోతిరాదిత్య సింధియా నిలబడటానికి అంతర్గత ఘర్షణను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈ ఏడాది చివరిలో జరిగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపక్ బాబారియా మాత్రం అటువంటి అవకాశమే లేదని చెబుతున్నారు.

2002 నుంచి గుణలో జ్యోతిరాదిత్య సింధియా ప్రాతినిధ్యం

2002 నుంచి గుణలో జ్యోతిరాదిత్య సింధియా ప్రాతినిధ్యం

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు అయిది. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని ఆయన క్యాబినెట్ సభ్యులంతా ఈ రెండు అసెంబ్లీ స్థానాల పరిధిలో విస్త్రుతంగా ప్రచారం చేస్తున్నారు. యావత్ ప్రభుత్వ యంత్రాంగం కూడా అధికార పార్టీకి అండగా నిలిచింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న రెండు సీట్లలో ‘గుణ' ఒకటి. గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఈ స్థానం నుంచి 2002 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

యశోధరా మేనల్లుడే జ్యోతిరాదిత్య

యశోధరా మేనల్లుడే జ్యోతిరాదిత్య

రాష్ట్ర మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా మేనత్త యశోధర రాజె సింధియా.. శివ్ పురి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభంలో నామినేషన్ల దాఖలు సమయంలో దూరంగా ఉన్నారు. కానీ తర్వాత కొలారస్ బీజేపీ అభ్యర్థి దేవేంద్ర జైన్ తరఫున ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

ఏప్రిల్ ఉప ఎన్నికల్లో ఎదురు తిరిగిన చౌహాన్ క్యాంపెయిన్

ఏప్రిల్ ఉప ఎన్నికల్లో ఎదురు తిరిగిన చౌహాన్ క్యాంపెయిన్

బీజేపీ అభ్యర్థి యశోధర తన తల్లి, బీజేపీ రాజమాత విజయరాజె సింధియా పేరుతో ఓట్లడుతున్నారు. విజయరాజె సింధియా సాక్షాత్ జ్యోతిరాదిత్య సింధియాకు నానమ్మ కూడా. సింధియాలు గతంలో మరొక అసెంబ్లీ స్థానంలో ప్రచారం చేసేవారు కాదు. ఇటీవల ఏప్రిల్ నెలలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సింధియాలు 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాట సమయంలో రాణి ఝాన్సీ లక్ష్మీభాయికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి మద్దతు పలికారని ప్రచారం చేశారు. జ్యోతిరాదిత్య సింధియాను లక్ష్యంగా చేసుకుని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రచారం చేస్తే అది చివరకు యశోధర సింధియాకు తగిలింది.

 సీఎం శివరాజ్, మంత్రి యశోధరా సెంటిమెంట్ ప్రచారం

సీఎం శివరాజ్, మంత్రి యశోధరా సెంటిమెంట్ ప్రచారం

కానీ ఈసారి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకింత జాగ్రత్త పడ్డారు. కేంద్ర మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ట్రాక్ రికార్డు లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారే గానీ కుటుంబంపై విమర్శలు గుప్పించలేదు. కొలారస్ అసెంబ్లీ స్థానం పరిధిలో ‘మీ ఓటు మీకు ఇద్దరు ఎమ్మెల్యేలను తెస్తుంది. అది నేను, పార్టీ అభ్యర్థి' అని మంత్రి యశోధర రాజె సింధియా ప్రచారం చేస్తున్నారు. మరో వైపు సింధియా అభిమానులు మాత్రం ‘ఆబ్ కీ బార్ సింధియా సర్కార్' అనే నినాదంతో హోరెత్తించారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే వాదనతో ప్రచారం చేస్తున్నారు.

 ముంగావోలీని స్మార్ట్ సిటీగా మారుస్తామని బీజేపీ హామీ

ముంగావోలీని స్మార్ట్ సిటీగా మారుస్తామని బీజేపీ హామీ

ముంగావోలీ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన మాజీ మంత్రి మహేంద్ర సింగ్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థి బైసాహబ్, కాంగ్రెస్ పార్టీ తరుఫున బ్రజేంద్ర సింగ్ పోటీ పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో 1.91 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముంగావోలీని ‘స్మార్ట్ సిటీ'గా అభివ్రుద్ధి చేస్తామని హామీ ఇస్తోంది. ఇక కొలారస్ అసెంబ్లీ స్థానం పరిధిలో 2.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ నుంచి దేవేంద్ర సింగ్ జైన్, కాంగ్రెస్ నుంచి మహేంద్ర సింగ్ పోటీ పడుతున్నారు.

రెండు స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని దీమా

రెండు స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని దీమా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు ప్రభాత్ ఝా మాట్లాడుతూ రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుంది. భూస్వామ్య వర్గానికి చెందిన నేత జ్యోతిరాదిత్య సిందియా ఏనాడు సీఎం కాలేరని ఆరోపించారు. మరోవైపు పేదల అభ్యున్నతికి చేపట్టిన సంక్షేమ పథకాలు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సహారియా గిరిజన కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.1000 కేటాయిస్తున్నారు. ఈ ప్రాంతంలో పిల్లలు పౌష్టికాహార లోపంతో అల్లాడిపోతున్నారు.

 ముంగావోలీలో ప్రచారానికి యశోధర రాజె సింధియా దూరం

ముంగావోలీలో ప్రచారానికి యశోధర రాజె సింధియా దూరం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కమల్ నాథ్, అరుణ్ యాదవ్, అజయ్ సింగ్ తదితరులకు ప్రచారంలో చోటేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ప్రభాత్ ఝా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది మాట్లాడుతూ రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. ముంగావోలీలో మంత్రి యశోధరా సింధియా ఎందుకు ప్రచారం చేయడం లేదన్నారు.

English summary
Kolaras in Shivpuri and Mungaoli in Ashoknagar go to polls on February 24, following the death of the sitting Congress MLAs. The outcome could decide whether the Congress chooses to project Scindia as CM candidate or goes by the tradition of naming none.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X