Mobile Alert: మొబైల్ అలర్ట్ మెసేజ్‍తో భయపడిన జనం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
గురువారం దేశావ్యాప్తంగా మొబైల్ ఓ మెసెజ్ వచ్చింది. ఈ మెసెజ్ తో పాటు సౌండ్ కూడా వచ్చింది. ఇది టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ నుంచి ఎమెర్జెన్సీ వచ్చింది. ఇది వస్తే బీప్ సౌండ్ తో ఈ మెసేజ్ లు వచ్చాయి. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో .. ఎందుకు వచ్చిందో తెలియక చాలా మంది వినియోగదారులు భయపడ్డారు. గందరగోళానికి గురయ్యారు. కొందరు సెల్ ఫోన్స్ హ్యకయయ్యాయని భయపడ్డారు. ఫోన్లు రీస్టార్ట్ చేయడం, రిపేర్ కు ఇవ్వడం చేశారు. కొందరైతే ఏదో జరిగిపోతుందని ఆందోళన చెందారు.
దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఈ మెసేజ్ కేంద్రమే పంపినట్లు చెప్పింది. ఇప్పటికే చాలా మందికి ఇలాంటి మెసేజ్ లు రాగా తాజాగా ఈ రోజు భారీ సంఖ్యలో టెలికామ్ వినియోగదారులకు మెసేజ్ లు వచ్చాయి. ఇంది భారత ప్రభుత్వ టెలికమ్యుూనికేషన్ కు చెందిన (TEST) విభాగానికి చెందిన టెస్టింగ్ మెసేజ్ అని తెలిపింది. దీనిపై ఎలాంటి ఆందోళన వద్దని స్పష్టం చేసింది.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ను పరీక్షించేందుకు ఈ మెసేజ్ పంపినట్లు పేర్కొంది. విపత్తు, నిర్వహణ, పబ్లిక సేఫ్టీలో భాగంగా ఈ మెసేజ్ లు పంపినట్లు స్పష్టం చేసింది. ఈ మెసేజ్ లో భారత ప్రభుత్వ టెలికామ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం ద్వారా పంపబడిన పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ దేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న TEST ఇండియా ఎమర్జెన్సీ వ్యవస్థకు పంపబడింది అని మెసేజ్ లో ఉంది.
అలాగే మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది, ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలు అందిస్తాయి. అంటూ 21-09-2023 తేదితో పాటు సమయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఈ మెసేజ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు బాషాల్లో వచ్చింది.












Click it and Unblock the Notifications