షాక్: పెళ్ళిరోజునే అత్యాచారం ఆరోపణలతో వరుడు అరెస్టు
పెళ్ళిరోజునే వరుడిపై అత్యాచారం ఆరోపణలతో అరెస్టు అయ్యారు.ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఓ యువతి పెళ్ళికొడుకుపై తప్పుడు ఆరోపణలు చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొల్హాపూర్: పెళ్ళిరోజునే వరుడిపై అత్యాచారం ఆరోపణలతో అరెస్టు అయ్యారు.ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఓ యువతి పెళ్ళికొడుకుపై తప్పుడు ఆరోపణలు చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పెళ్ళిరోజే అత్యాచారం ఆరోపణలతో పెళ్ళికొడుకు అరెస్టు కావడంతో ఆ వివాహం రద్దైంది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో సంబరాలతో ఉండాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

మహరాష్ట్రలోని కొల్హాపూర్ లో పెళ్ళిరోజునే పెళ్ళికొడుకు అరెస్టు కావడం సంచలనం కల్గించింది. అత్యాచార ఆరోపణలతో ఆయన అరెస్టు కావడం గమనార్హం.
గత ఏడాది నవంబర్ 1వ, తేదిన తాను ఇంట్లో ఉన్న సమయంలో దశరథ్ ఖాట్ అనే 28 ఏళ్ళ యువకుడు వచ్చి తనపై అత్యాచారం చేశాడని సాంగ్లీ గ్రామానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది.
సంఘటన గురించి ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తమ ఇంటికి వచ్చి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది.
ఆ యువతి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 376,450, 506 ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డిఎస్పీ కిషోర్ కాలే చెప్పారు.
అయితే తనను పెళ్ళాడలేదనే అసూయతోనే ఆ యువతి యువకుడి పెళ్ళిరోజే రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడికి ఈ నెల 23వ, తేది వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.
అయితే ఆదివారం నాడు ఉదయం పూట దశరథ ఖాట్ వివాహం జరగాల్సి ఉంది. అయితే అదే రోజున ఆయనను పోలీసులు అరెస్టు చేయడంతో వివాహం నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications