వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓనం బంపర్ లాటరీ: రూ. 25 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్, అంతులేని ఆనందం

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఓనం బంపర్ లాటరీ ఆ నిరుపేద ఇంట్లో నిజంగానే పెద్ద పండగనే తీసుకొచ్చింది. అప్పులపాలై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ ఆటో డ్రైవర్‌కు ఏకంగా.. ఓనం బంపర్ లక్కీ డ్రాలో రూ. 25 కోట్లు వచ్చాయి. రూ. 3 లక్షల కోసం బ్యాంకు లోన్ కు అప్లై చేసిన మరుసటి రోజే ఇది జరిగింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

రూ. 25 కోట్ల విజేతగా నిలిచిన ఆటో డ్రైవర్

రూ. 25 కోట్ల విజేతగా నిలిచిన ఆటో డ్రైవర్

వివరాల్లోకి వెళితే.. కేరళ తిరువనంతపురంలోని శ్రీవరాహమ్ ప్రాంతానికి చెందిన అనూప్ అనే ఆటో డ్రైవర్ చెఫ్‌గా పనిచేసేందుకు మలేషియాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఎప్పటిలాకే శనివారం అతడు లాటరీ టిక్కెట్(టీజే750605) కొనుగోలు చేశాడు. తొలుత ఎంచుకున్న టిక్కెట్ నచ్చకపోవడంతో వేరేదాన్ని తీసుకున్నాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది. లాటరీ శాఖ తిరువోణం బంపర్ లాటరీలో రూ.25 కోట్ల విజేతగా నిలిచాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన డ్రా సమయంలో అతని విజేత టికెట్ - TJ-750605 నంబర్ వచ్చింది.

రూ. 500తో లాటరీ టికెట్ కొంటే.. రూ. 25 కోట్లు వచ్చాయి

రూ. 500తో లాటరీ టికెట్ కొంటే.. రూ. 25 కోట్లు వచ్చాయి

వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన అనూప్ డ్రాకు ఒకరోజు ముందు శనివారం సాయంత్రం పజవంగడి నుంచి రూ.500 లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. 25 కోట్ల లాటరీ తగిలిన అనూప్‌కు దాదాపు రూ.15.75 కోట్లు దక్కాయి. ఇది ఇప్పటివరకు అత్యధిక రాష్ట్ర లాటరీ విజయం. అనూప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అదృష్టం తనకు అనుకూలంగా ఉంటుందని ఊహించలేదన్నాడు. చివరి నిమిషంలో టికెట్ కొనేందుకు తన కొడుకు పిగ్గీ బ్యాంకు నుంచి రూ.50 తీసుకున్నట్లు అనూప్ చెప్పాడు.

లాటరీ మొత్తంతో ఇల్లు, హోటల్ వ్యాపారంలోకి ఆటో డ్రైవర్

లాటరీ మొత్తంతో ఇల్లు, హోటల్ వ్యాపారంలోకి ఆటో డ్రైవర్

తనకు లాటరీ ద్వారా వచ్చిన మొత్తం తన అప్పులు తీర్చేస్తానని, మంచి ఇల్లు కట్టుకుంటానని అనూప్ తెలిపాడు. అంతేగాక, బ్యాంకుకు ఫోన్ చేసి లోన్ వద్దని చెప్పానన్నాడు. ఇక విదేశాలకు కూడా వెళ్లనని, హోటల్ వ్యాపారం ప్రారంభించనున్నట్లు తెలిపాడు. అంతేగాక, చారిటీ పనులు కూడా చేస్తానని అనూప్ వెల్లడించాడు. కాగా, గెలిచిన టికెట్‌ను అనూప్‌కు విక్రయించిన ఏజెంట్‌కు రూ.2.5 కోట్లు అందజేయగా, మిగిలిన మొత్తాన్ని పన్నుగా మినహాయించనున్నారు. అనూప్ ద్వారా మరో వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు. భగవతి లాటరీ ఏజెన్సీ పజవంగడి బ్రాంచ్‌లో టిక్కెట్‌ను విక్రయించారు. ఇదిలా ఉండగా, కొట్టాయంలో విక్రయించిన టికెట్‌కు రెండో బహుమతి రూ.5 కోట్లు లభించాయి. గెలిచిన టికెట్ -- TG 270912 -- పప్పచన్ అనే వ్యాపారి విక్రయించాడు, అతను మరొక టిక్కెట్ ఏజెన్సీ నుండి పది టిక్కెట్లను కొనుగోలు చేసి విక్రయించాడు.

English summary
Onam bumper lottery: Kerala auto driver wins Rs 25 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X