వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షేమాన్ని కోరుకునే భారత్‌వైపే ప్రపంచ చూపు, దేశానికి తేగ్ బహదూర్ స్పూర్తి: ఎర్రకోటపై ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ సంక్షేమం కోసం భారత్ పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోసారి భారత్ వైపు ప్రపంచం చూస్తోందని చెప్పారు. సిక్కుల మతగురువు తేగ్​ బహుదూర్​ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరై తేగ్​ బహదూర్​కు నివాళులర్పించారు. ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం(రూ. 400 నాణెం) విడుదల చేశారు.

సాంప్రదాయానికి భిన్నంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రసంగం

సాంప్రదాయానికి భిన్నంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రసంగం

అనంతరం తొలిసారిగా ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. స్వాతంత్ర వేడుకల సమయంలో ప్రసంగించే చోటు వద్ద కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగాన్ని నిర్వహించారు. ప్రకాశ్​ పర్వ్​ సందర్భంగా.. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ప్రధాని మోడీ.

భారత్ ఇప్పటికీ ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటోంది: ప్రధాని మోడీ

భారత్ ఇప్పటికీ ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటోంది: ప్రధాని మోడీ

సిక్కు గురువుల ఆదర్శాలను భారత్​ అనుసరిస్తోందని, అందుకు సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఈ పుణ్య తిథి పురస్కరించుకొని.. 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నా అని అన్నారు. మత గురువులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించారని, ఇందుకోసం తమ జీవితాలను సమర్పించారని వ్యాఖ్యానించారు. భారత్​ ఎప్పుడూ ఏ దేశానికీ.. ఎలాంటి ముప్పూ కలిగించలేదని మోడీ అన్నారు. ఇప్పటికీ భారత్.. ప్రపంచ సంక్షేమాన్నే కోరుకుంటోందని అన్నారు.

తేగ్ బహదూర్‌కు ఇక్కడ్నుంచే మరణశిక్ష విధించిన ఔరంగజేబ్

తేగ్ బహదూర్‌కు ఇక్కడ్నుంచే మరణశిక్ష విధించిన ఔరంగజేబ్


తేగ్​ బహుదూర్​కు మరణశిక్షకు అప్పటి ముఘల్​ రాజు ఔరంగజేబ్​ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. స్వాతంత్య్ర వేడుకల సమయంలో కాకుండా ఈ ప్రాంతంలో ప్రధాని ప్రసంగించడం ఇది రెండోసారి. అంతకుముందు.. 2018లో స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఆజాద్​ హింద్​ ప్రభుత్వం స్థాపించి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మోడీ ఎర్రకోట వద్ద ప్రసగించారు.

భారీ భద్రతా వలయంలో ఎర్రకోట పరిసరాలు

కాగా, ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రసంగం నేపథ్యంలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 మందికి పైగా ఢిల్లీ పోలీసులు, వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. ప్రసంగ వేదికలో సహా కోట ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాలతో పహారా ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, స్వాట్ కమాండోలు, కైట్ క్యాచర్లు, కానైన్ యూనిట్లు, షార్ప్ షూటర్లతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతోన్న తరుణంలో కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిక్కు ప్రతినిధులు, గురువులు పాల్గొన్నారు.

English summary
'Once again the world is looking up to India', Guru Tegh Bahadur Inspired Nation: PM Modi at Red Fort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X