శశికళ ఎమ్మెల్యేల ఖర్చెంతో తెలుసా?: రిసార్టులో బిల్లుల లెక్క ఇదే!

గడిచిన వారం రోజులకు గాను దాదాపు కోటి రూపాయలకు పైనే రిసార్టు యాజమాన్యం బిల్లులు వేసినట్టు తెలుస్తోంది.

చెన్నై: క్యాంపు రాజకీయాలతో తన ఎమ్మెల్యేలు పట్టు జారిపోకుండా జాగ్రత్తపడుతున్న శశికళ వారందరిని గోల్డెన్ బే రిసార్టులో దాచిపెట్టిన సంగతి తెలిసిందే. పన్నీర్ తిరుగుబాటు బావుటా ఎగరేసిన మరునాడే ఎమ్మెల్యేలను ఆమె గోల్డెన్ బే రిసార్టుకు తరలించారు. దీంతో దాదాపు గత 10రోజులుగా తమిళనాడు రాజకీయాలు గోల్డెన్ బే రిసార్టు చుట్టూ తిరుగుతూ వస్తున్నాయి.

తాజాగా రిసార్టులో ఎమ్మెల్యేల ఖర్చులకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. గడిచిన వారం రోజులకు గాను దాదాపు కోటి రూపాయలకు పైనే రిసార్టు యాజమాన్యం బిల్లులు వేసినట్టు తెలుస్తోంది. వందమందికి పైగా ఎమ్మెల్యేలు, వారికి కాపలాగా మరో 200 మంది బౌన్సర్లు, వారందరికీ మూడు పూటలా భోజనాలు, ఆపై విందు వినోదాలు.. ఇవన్నీ కలిపి కోటి రూపాయలకు పైనే బిల్లు అయినట్టు సమాచారం.

One crore bill of expenditure for Sasikala MLAs

కాగా, ఈ రిసార్టులో మూడు రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు రూ. 5,500 అద్దెతో ట్రాంక్విల్ గదులు, రూ. 6,600 అద్దెతో బే వ్యూ గదులు, రూ. 9,900 అద్దెతో పారడైజ్ సూట్ గదులు ఉన్నాయి. ఇందులో 60 గదులను గనుక బుక్ చేసుకుంటే ఆరు రోజులకు రూ.25లక్షలు చెల్లించాల్సి వస్తుంది.

గదుల ఖర్చుతో పాటు వారికి భోజనాలు, ఇతరత్రా సౌకర్యాలు అన్ని కలిపితే మరో రూ.25లక్షలు
ఖర్చు అవుతుంది. వీటికి తోడు కొత్త దుస్తులు, వారు కోరిన సౌకర్యాలన్ని కల్పించడంతో బిల్లు తడిచి మోపెడైనట్టు చెబుతున్నారు. అయితే బిల్లులు చెల్లించే బాధ్యతను ఎవరు తీసుకున్నారు? దీనికి డబ్బు ఎలా సమకూరుతోంది? వంటి వాటిపై స్పష్టత లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+