వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ..ఒకరు మృతి

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ : మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో హింస చెలరేగింది. మాల్డా నియోజకవర్గానికి జరిగుతున్న ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ముందుగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా మోతీగంజ్‌లోని టీఎంసీ కార్యాలయాన్ని ధ్వసం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. గొడవలకు పాల్పడి తృణమూల్ కాంగ్రెస్ రిగ్గింగ్‌ చేయాలని భావిస్తోందని బీజేపీ ఆరోపించింది. జరిగిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపింది.

One killed after Clashes erupt between TMC and BJP in third phase polling
మల్దాహ నియోజకవర్గంలో మరో హింసాత్మక ఘటన జరిగింది. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య జరుగుతున్న గొడవను సాగర్ రాయ్ అనే కమలం పార్టీ నేత తన ఫోనులో రికార్డు చేస్తుండగా ఆయన్ను పట్టుకుని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. చచోల్‌లోని 173వ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం టీఎంసీ కార్యకర్తలు చేశారని బీజేపీ ఆరోపించింది. ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. రాణినగర్‌ బూతు నెంబర్ 27 మరియు 28లపై కొందరు వ్యక్తులు నాటు బాంబులు విసిరారు.

ఇదిలా ఉంటే ముర్షిదాబాద్‌లో కాంగ్రెస్ టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో ఓ గ్రామస్తుడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని బాలిగ్రామ్ వాస్తవ్యుడు తియారుల్ కలామ్‌గా గుర్తించారు. గొడవల కారణంగానే తియారుల్ మృతి చెందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

English summary
Sporadic incidents of violence have been reported from across West Bengal in the third phase of polling. The clashes between the TMC and the BJP have escalated. The TMC workers allegedly ransacked the BJP camp office, following which the BJP workers razed the camp office of the TMC in Motigunj area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X