శశికళకు ఒక నెల పూర్తి అయ్యింది: దిక్కే లేకుండా జైల్లో పాపం ఇలా !

తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడిన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని నెల అయ్యింది.

గళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడిన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని నెల అయ్యింది.

బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను చూడటానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. అక్రమస్తుల కేసులో గతంలో జయలలిత, శశికళ ఇదే జైల్లో ఉన్న సమయంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్ని పనులు పక్కన పెట్టి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ దగ్గరే మకాం వేశారు.

తమిళనాడు మంత్రులు సైతం అప్పట్లో బెంగళూరులోనే మకాం వేశారు. తమిళనాడులోని అమ్మ అభిమానులు ప్రతి రోజు కొన్ని వేల మంది బెంగళూరు చేరుకుని జయలలితను చూడాలని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సిబ్బందికి మనవి చేసేవారు.

One month jail term completed for Sasikala who is in Bengaluru central jail since Feb. 15 as asset case convict.

అయితే జయలలిత మరణించడంతో ఇప్పుడు శశికళ, ఇళవరసి, సుధాకరన్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శశికళను చూడటానికి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గరకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోవడంతో ఇక్కడ ప్రశాంతంగా ఉందని ఆ ప్రాంతంలోని ప్రజలు అంటున్నారు,

శశికళ భర్త నటరాజన్ సైతం వారం రోజుల నుంచి బెంగళూరు వైపు కన్నెత్తికూడా చూడటం లేదని తెలిసింది. ఇక ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సీఎం అయిన తరువాత ఒక్క సారి కూడా శశికళను చూడటానికి బెంగళూరు రాలేదు. మొత్తం మీద శశికళ ఇప్పడు అందరికీ చేదు అయిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+