నిత్యానంద స్వామి ఆశ్రమంలో యువతుల కిడ్నాప్ కేసు: మాకు ప్రాణహాని, రక్షించండి, వీడియో విడుదల !

బెంగళూరు: వివాదాల స్వామీజి నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానంద ఆశ్రమం నుంచి అనుమానాస్పదంగా మాయం అయిన ఇద్దరు యువతులు (అక్కాచెల్లి) కేసు మరో మలుపు తిరిగింది. నిత్యానంద ఆశ్రయం నుంచి మాయం అయిన యువతి తనకు ప్రాణహాని ఉందని, ఇక ముందు నేను మీకు కనపడే అవకాశం ఉందో ? లేదో ? అనే విషయం తనకే తెలియడం లేదని, మమ్మల్ని రక్షించాలి అంటూ ఓ వీడియో విడుదల చెయ్యడంతో కలకలం రేపింది. అసలు ఆ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారు ? ఎవరు విడుదల చేశారు ? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

బెంగళూరు యువతులు

బెంగళూరు యువతులు

బెంగళూరుకు చెందిన జనార్దన్ శర్మా అనే వ్యక్తి ఇటీవల గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని నిత్యానంద ఆశ్రయంలో ఉన్న తన ఇద్దరు మైనర్ కుమార్తెలను ఆశ్రయం నిర్వహకులు కిడ్నాప్ చేసి బలవంతంగా నిర్బంధించారని, తమను కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని, మాకు న్యాయం చెయ్యాలని, మా అమ్మాయిలను మాకు అప్పగించాలని గుజరాత్ హై కోర్టును ఆశ్రయించారు.

కిడ్నాప్ చెయ్యలేదు

కిడ్నాప్ చెయ్యలేదు

కొన్ని రోజుల క్రితం జనార్దన్ శర్మా పెద్ద కుమార్తె ఫేస్ బుక్ లైవ్ పేజ్ లో మాట్లాడుతూ మమ్మల్ని ఎవ్వరూ కిడ్నాప్ చెయ్యలేదని, తమ ఇష్ట ప్రకారం నిత్యానంద స్వామి ఆశ్రయంలో ఉన్నామని, స్వామీజి మమ్మల్ని చాలాబాగా చూసుకుంటున్నారని చెప్పారు. వ్యక్తిగత కారణాల వలనే తాము తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని, మేము ఆశ్రమంలోనే ఉంటామని, మేము ఎక్కడికి రామని జనార్దన్ శర్మా కుమార్తె తేల్చి చెప్పింది.

ప్రాణాలతో ఉంటానో ? లేదో తెలీదు

ప్రాణాలతో ఉంటానో ? లేదో తెలీదు

నిత్యానంద ఆశ్రమంలో ఉన్న జనార్దన్ శర్మా కుమార్తెల్లో ఒకరైన నిత్యతత్వ ప్రియా ఆనంద అలియాస్ లోపముద్రా అనే యువతి ఇప్పుడు మరో వీడియో విడుదల చేసింది. తనకు ప్రాణహాని ఉందని, అందుకే ఇప్పుడు వీడియో విడుదల చేస్తున్నానని, మరో వీడియో విడుదల చేస్తానో ? లేదో ? అనే విషయం తనకే తెలియడం లేదని ఆందోళనతో మాట్లాడిన వీడియో ఇప్పుడు విడుదల కావడంతో కలకలం రేపింది.

నన్ను రక్షించండి

నన్ను రక్షించండి

తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఆందోళనతో నిత్యతత్వ ప్రియా ఆనంద అలియాస్ లోపముద్రా అనే యువతి ఆవేదనతో మాట్లాడుతున్న వీడియో విడుదలైయ్యింది. అయితే ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఈ విషయంపై యువతి తండ్రి జనార్దన్ శర్మా న్యాయవాది వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారు అనే విషయంపై దర్యాప్తు చేయించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చెయ్యాలని కోర్టును ఆశ్రయించారు.

నిత్యానంద ఆశ్రమంలో తండ్రి మేనేజర్

నిత్యానంద ఆశ్రమంలో తండ్రి మేనేజర్

బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని నిత్యానంద ఆశ్రమంలో జనార్దన్ శర్మా అనే ఆయన మేనేజర్ గా పని చేసే వారు. ఆ సమయంలో జనార్దన్ శర్మా నలుగురు కుమార్తెలను ఆశ్రమంలో వదిలిపెట్టారు. తరువాత నిత్యానంద ఆశ్రమంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జనార్దన్ శర్మా అక్కడ ఉద్యోగం నిలిపివేసి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో జనార్దన్ శర్మా ఇద్దరు కుమార్తెలు ఆయనతో పాటు నిత్యానంద ఆశ్రయం నుంచి బయటకు వచ్చేశారు.

ఇద్దరు అమ్మాయిలు ఆశ్రమంలో !

ఇద్దరు అమ్మాయిలు ఆశ్రమంలో !

తన మరో ఇద్దరు కుమార్తెలను నిత్యానంద తన ఆశ్రయంలో నిర్బంధించారని, వారిని తమకు అప్పగించాలని జనార్దన్ శర్మా అహమ్మదాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరు కుమార్తెల్లో ఒకరు ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందంటూ విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. యువతి వీడియో విడుదల చెయ్యడంతో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+