వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో 23 కోట్ల కరెంట్ బిల్లా, నేనేడా కట్టేది..!

|
Google Oneindia TeluguNews

లక్నో : కరెంట్ బిల్లు మహా అయితే ఎంతొస్తుంది. మూడొందలో, ఐదొందలో వస్తుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వినియోగం ఎక్కువుంటే వెయ్యో, రెండు వేలో వస్తుంది. ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఒకాయనకు 23 కోట్ల రూపాయలకు పైగా బిల్లు వచ్చింది. ఇంతకు ఆయన అంతలా కరెంట్ వినియోగించారా అంటే అదీ లేదు. మరీ అంత బిల్లు ఎందుకొచ్చినట్లు? కన్నౌజ్ ప్రాంతంలోని విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఆ బిల్లుకు సాక్ష్యం.

'సెక్స్' కు ఒప్పుకోలేదని, ట్రాన్స్‌జెండర్‌పై 'కాల్పులు'..! 'సెక్స్' కు ఒప్పుకోలేదని, ట్రాన్స్‌జెండర్‌పై 'కాల్పులు'..!

అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి తనకొచ్చిన కరెంట్ బిల్లు చూసి అవాక్కయ్యారు. 23 కోట్ల 67 లక్షల 71 వేల 524 రూపాయలు బకాయి ఉందనేది బిల్లు సారాంశం. 178 యూనిట్లు మాత్రమే కరెంట్ వాడుకున్నాననేది ఆయన వెర్షన్. యూపీ రాష్ట్రమంతటా కాల్చిన యూనిట్ల తాలూకు బిల్లు తనకు పంపించారేమోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు బాసిత్. జీవితకాలం తాను కష్టపడి సంపాదించినా.. అంత మొత్తం కట్టలేను అంటూ వాపోయారు.

One Person got Rs 23 crore electricity bill in Uttar Pradesh

అదలావుంటే స్థానిక విద్యుత్ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సాధారణమేనంటూ చెప్పుకొచ్చారు. బిల్లు అంతలా వచ్చిందని వినియోగదారుడు ఇబ్బందిపడాల్సిందేమీ లేదని... సరిచేశాక వాస్తవ బిల్లు కట్టొచ్చని తెలిపారు. అయితే ఆ బిల్లు చూసి మొదట బాసిత్ కంగారుపడ్డా.. అధికారుల సమాధానంతో ఊపిరి పీల్చుకున్నారు.

English summary
One Person Abudl Basit got a electricity bill of over Rs 23 crore in Uttar Pradesh. His version is only 178 units consumed. He said that, Even i had a hard time earning a lifetime, i doen't pay such amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X