మంచి నీళ్లకు పరిష్కారం: మూడు పెళ్లిళ్లు చేసుకో!

భోపాల్: తాగు నీటి సమస్యను పరిష్కరించుకోవాలంటే ఒక్కోక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంట. ముగ్గురు భార్యలు ఉంటే తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందని, అయితే ముగ్గురు భార్యలు జీవితంలో భారం కాకూడదని మళ్లీ సలహా ఇస్తున్నారు.

మద్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో విపరీతమైన తాగు నీటి సమస్య ఉంది. తాగు నీటి పరిష్కారానికి బుందేల్ ఖండ్ ప్యాకేజీ కింద రూ. వందల కోట్లు నిధులు విడుదల చేసినా అక్కడ మాత్రం తాగు నీటి సమస్యకు పరిష్కారం లభించలేదు.

 One wife for giving birth to kids and other two to fetch water

జతరా సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ (ఎస్ డీఎం) బీకే. పాండే అక్కడ ఉంటున్న స్థానికులకు ఒక ఉచిత సలహా ఇచ్చారు. స్థోమత ఉన్న వారు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. ఒకరు ఇంటిలో పిల్లలను చూసుకుంటారని చెప్పారు. ఇద్దరు తాగు నీరు తీసుకు వస్తారని అన్నారు.

అయితే ఆర్థిక స్థోమత ఉన్న వారు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. తాను రాత్రి రెండు గంటల సమయంలో ఇటు వైపు వెలుతుంటే మహిళలు నీళ్లు తీసుకు వస్తున్న విషయం తన కంటపడిందని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ బీకే. పాండే విచారం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+