బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్భయ్‌ మిసైల్‌ను వెంబడించిన యుద్ధవిమానం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తొలి సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ నిర్భయ్‌ని అక్టోబర్ 17, 2014న భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రశంసలు తెలియజేస్తూ అనేక ట్వీట్లు వెల్లువెత్తాయి. జాగ్వర్ యుద్ధ నౌక నిర్భయ్‌ని వెంబడించిందని ఓ రచయిత చేసిన ట్వీట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ మిసైల్‌ను వెంబడించే సైనిక విమానం మన సైన్యంలో ఉందంటే మన సైనిక సామర్థ్యాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనే చెప్పాలి.

ఆ తర్వాత రెండు వారాలకు భారత్ నిర్భయ్‌ని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. వన్ ఇండియా.. రక్షణ పరిశోధన అభివృద్ధి(డిఆర్‌డిఓ), ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్)లు సంయుక్తంగా ప్రయోగించిన ఈ స్కై థ్రిల్లర్ గురించి ఇండియన్ నేవీ మద్దతుతో పలు వివరాలను సేకరించింది.

ఐఏఎఫ్ రెండు సుఖోయ్ విమానాలను సిద్ధం చేసుకుంది. ఇవి కళాయికుంద ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఉన్నాయి. పైలెట్లు వాటి గురించి సవివరంగా తెలుసుకుని సమయాన్ని బట్టి ఉపయోగించనున్నారు. బాలసోర్‌లోని డిఆర్డీఓ ఇంటరిమ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్)లో, ఢిల్లీలోని ఐఏఎఫ్ హెచ్‌క్యూలో హాట్‌లైన్స్ యుద్ధ విమానాల ప్రయోగ సమయంలో బిజీగా ఉంటాయి.

OneIndia Special: Sky thriller - When fighter plane Jaguar striker chased Nirbhay missile

‘మేము నిర్భయ్‌ను వెంబడించే ఒక సుఖోయ్‌ విమానాన్ని నిరుడు రద్దు చేశాం. కేటాయించిన మార్గం నుంచి ప్రారంభించిన కొన్ని నిమిషాలకు ఇందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో సుఖోయ్‌ను వెనక్కిరప్పించాం. దాని స్థానంలో జాగ్వర్‌ను వెంబడించేందుకు పంపించాం' అని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు.

ఐఏఎఫ్ మొదట మిగ్-27ను ప్రయోగించాలనుకున్న్పటికీ .. జాగ్వర్ అధిక సామర్థ్యం కారణంగా దీన్నే ప్రయోగించేందుకు ముందుకు వచ్చింది. జాగ్వర్ అంబాల నుంచి కళాయికుందకు ప్రయోగించబడింది.

పైలెట్లు భద్రత కోసం దూరాన్ని చూసుకోవాలి

మైరేగ్స్, జాగ్వర్స్, సుఖోయ్‌లు లాంగ్ రేంజ్ మిసైల్స్‌ను కూడా వెంబడిస్తాయని చెప్పారు. ‘ వీడియో ఫుటేజీ మిసైల్‌కు సంబంధించిన శక్తి సామర్థ్యాలను శాస్త్రవేత్తలకు తెలియజేస్తుంది. సహకారం ఎక్కువ అందించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, అనుభవం కలిగిన పైలెట్లు మాత్రమే వీటిని పర్యవేక్షిస్తారు. మిసైల్‌ను వెంబడించేప్పుడు పైలెట్లు భద్రత కోసం సరైన దూరాన్ని ఉండేలా చూసుకోవాలి. నేవీ మిసైల్‌ను కాల్చాలనుకున్నప్పుడు, ఐఏఎఫ్ విధుల్లో పాల్గొంటుంది' అని ఓ అధికారి చెప్పారు.

మిసైల్‌ను వెంబడించేందుకు ముందే ప్రణాళిక వేయబడుతుంది కాబట్టి పైలెట్లు దాన్ని జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది. ‘మిసైల్ వెళ్లే వేగం, వెళ్లే మార్గం(ఒక వేళ నిర్భయ్ అయితే) ముందే తెలిసి ఉంటుంది. ఆ నిర్భయ్ ప్రయోగం వీడియో దీనికి చాలా పొలికలు ఉంటాయి. మిసైల్‌ను జాగ్వర్ ఎక్కువ సేపు వెంబడించలేదు. ఎందుకంటే అందులో ఇంధనం చాలా తక్కువ ఉంటుంది. 45నిమిషాలపాటు ప్రయాణించిన తర్వాత అది ఆగిపోయే అవకాశం ఉంటుంది' అని చెప్పారు.

ఐఏఎఫ్, నేవీల పాత్ర స్ఫూర్తి దాయకం: డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్

డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్(ఏరో) డాక్టర్ కె తమల్మణి మాట్లాడుతూ.. నిర్భయ్ ప్రయోగం సందర్భంగా ఐఏఎఫ్, నేవీలు స్ఫూర్తి దాయకమైన పాత్ర పోషించాయి. ‘ప్రయోగం సందర్భంగా నిర్భయ్‌ ప్రయోగాన్ని గమనించేందుకు, ఎయిర్ క్రాఫ్ట్‌ను వెంబడించేందుకు ఒక హెలికాప్టర్ ప్రయోగ కేంద్రం వద్ద, మరొకటి కళాయికుంద బేస్ వద్ద సిద్ధం చేశారు. ఐఏఎఫ్, నేవీల మద్దతుతో నిర్భయ్ ప్రయోగం విజయవంతమైంది' అని తమిల్మణి తెలిపారు.

గొప్ప సహకారం: ఏడిఈ డైరెక్టర్

‘ఇదో గొప్ప మారథాన్ సహకారం. వైమానిక దళాలు మిసైల్ ఎగిరేటప్పుడు, కిందికి దిగేటప్పుడు రికార్డు చేయడం జరుగుతుంది. ఇందు కోసం హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. వాటిని చేజ్ చేస్తూ రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమర్థవంతమైన ప్రయోగాలు దేశ భద్రతా పట్ల భద్రతా దళాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి' అని శ్రీకుమార్ వన్ ఇండియాకు తెలిపారు.

వెంబడించడమనేది నిపుణతగల ఉద్యోగం: తేజాస్ టెస్ట్ పైల్

వెంబడించడమనేది ఒక నైపుణ్యం గల ఉద్యోగమని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తేజాస్ టెస్ట్ పైల్ తెలిపారు. విజయమనేది పక్కా ప్రణాళికపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

‘ఆలస్యంగా ఉండకూడదు. ముందూ వెళ్లకూడదు. మిసైల్ ప్రయోగించిన వెంటనే వెంబడించడం మొదలుపెట్టాల్సి ఉంటుంది. అదే నిర్భయ్ లాంటి మిసైల్ అయితే విమానంలా ఎగురుతుంది కాబట్టి పైలట్‌కి కొంత సులభంగా ఉంటుంది. మిసైల్ వేగాన్ని సరిచూసుకుంటూ వెంబడించవచ్చు' అని పైలట్ చెప్పారు. మిసైల్‌ను వెంబడించడంలో చాలా ప్రమాదాలుంటాయని, ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆయుధాలుంటాయని తెలిపారు.

‘ ఎయిర్ క్రాఫ్ట్‌కు ఆయుధాలను లాక్ చేయరాదు. మిసైల్ ముందు వెళ్లకూడదు. అలా ముందుకెళ్లిన ఘటన ఇటీవల అమెరికాలో చోటు చేసుకుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్‌ను మిసైల్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మిసైల్‌కు కొంత దూరంగా ఉంటూ వెంబడించాల్సి ఉంటుంది. లేదంటే వాటి మధ్య రాపిడి జరిగి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది' అని చెప్పారు.

‘ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తూ నేను తేజాస్ ఫైరింగ్ ఆర్-73(రష్యాలో తయారైన)ని సూపర్సోనిక్ వెంబడించి క్యాప్చర్ చేశాను. ఏ నిమిషంలోనైనా నీ దృష్టి నుంచి మిసైల్ తప్పిపోయే అవకాశం ఉంటుంది. మిసైల్ వేగాన్ని, మార్గాన్ని గమనించుకుంటూ జాగ్రత్తగా వెంబడించాల్సి ఉంటుంది' అని తెలిపారు.

(ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి సీజన్డ్ ఏరోస్పేస్, భారతదేశంలో డిఫెన్స్ జర్నలిస్ట్. అతను వన్ఇండియా కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. అతను ట్వీట్స్ @writetake)

English summary
Among the tweets that went viral on Oct 17, 2014, the day India successfully test-fired its first subsonic cruise missile, Nirbhay, one read, "Jaguar fighter chases Nirbhay missile!" This tweet from this writer took many by surprise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X