Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

girlfriend: బ్యాంకులో లోన్ తీసుకుని ఆన్ లైన్ గర్ల్ ఫ్రెండ్ కు రూ. 28 లక్షలు ఇచ్చిన టీచర్, క్లైమాక్ప్ లో ?

రెండు బ్యాంకుల్లో లోన్ తీసుకున్న ప్రభుత్వ టీచర్ ఆమె అడిగింత డబ్బులు ఇచ్చాడు. రూ. 28 లక్షలు తీసుకున్న గర్ల్ ఫ్రెండ్ చేతులు ఎత్తేసింది. డెత్ నోట్ లో గర్ల్ ఫ్రెండ్ పేరు రాసి పెట్టి ?.

బెంగళూరు: చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న ప్రభుత్వ టీచర్ అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్కూల్ పూర్తి అయిన తరువాత ఆ టీచర్ సోషల్ మీడియాలో కాలం గడుపుతున్నాడు. టీచర్ కు ఆన్ లైన్ ఓ మహిళ పరిచయం అయ్యింది. చాలాకాలం పాటు ఇద్దరూ టచ్ లో ఉన్నారు. తనకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని, నగదు సహాయం చెయ్యాలని టీచర్ కు ఆమె గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. రెండు బ్యాంకుల్లో లోన్ తీసుకున్న ప్రభుత్వ టీచర్ ఆమె అడిగింత డబ్బులు ఇచ్చాడు. రూ. 28 లక్షలు తీసుకున్న గర్ల్ ఫ్రెండ్ చేతులు ఎత్తేసింది. బ్యాంకులో ఇంతకాలం వడ్డీ కడుతున్న ప్రభుత్వ స్కూల్ టీచర్ ఆర్థిక సమస్యలు తట్టుకోలేక డెత్ నోట్ లో గర్ల్ ఫ్రెండ్ పేరు రాసి రైలుకు ఎదురుగా నిలబడ్డాడు.

ప్రభుత్వ స్కూల్ టీచర్

ప్రభుత్వ స్కూల్ టీచర్

కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బీళగిలో నివాసం ఉంటున్న శంకరప్ప బైరెడ్డి అలియాస్ శంకరప్ప రెడ్డి (46) కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలుకాలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సింధనూరులో శంకరప్ప రెడ్డి అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్కూల్ పూర్తి అయిన తరువాత టీచర్ శంకరప్ప రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు. శంకరప్ప రెడ్డి దంపతులకు పిల్లలు లేరు.

బెంగళూరు నందిని

బెంగళూరు నందిని

కొన్ని నెలల క్రితం టీచర్ శంకరప్పకు బెంగళూరుకు చెందిన నందిని అనే మహిళ ఆన్‌లైన్ లో పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరి మధ్య చాలా జరిగాయని సమాచారం. చాలాకాలం పాటు నందిని, శంకరప్ప రెడ్డి ఇద్దరూ టచ్ లో ఉన్నారు. తనకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని, నగదు సహాయం చెయ్యాలని టీచర్ శంకరప్ప రెడ్డికి అతని గర్ల్ ఫ్రెండ్ నందిని చెప్పింది. నా సమస్యలు తీరిపోతే మనం చక్కగా ఉందామని నందిని శంకరప్ప రెడ్డికి మాయమాటలు చెప్పిందని తెలిసిందిద.

గర్ల్ ఫ్రెండ్ కు రూ. 28 లక్షలు ఇచ్చిన టీచర్

గర్ల్ ఫ్రెండ్ కు రూ. 28 లక్షలు ఇచ్చిన టీచర్

ప్రభుత్వ ఉద్యోగం కావడంతో శంకరప్ప రెడ్డి బ్యాంకులో లోన్ కు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీకి రూ. 35 లక్షలు అప్పుగా తీసుకున్న టీచర్ శంకరప్ప అందులో రూ. 28 లక్షలు ఆన్ లైన్ గర్ల్ ఫ్రెండ్ బెంగళూరు నందికి అప్పుగా ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత నందిని శంకరప్ప రెడ్డితో ఎక్కువగా టచ్ లో లేకుండా తనకు వేరే పనులు ఉన్నాయని, త్వరలో నిన్ను కలుస్తానని చెబుతూ ఫోన్ కాల్ కు చిక్కకుండా తప్పించుకుని తిరిగింది.

ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్

ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్

బెంగళూరు నందిని చెప్పిన టైమ్ కు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో టీచర్ శంకరప్ప ప్రతినెల జీతంలో ఎక్కువ డబ్బులు బ్యాంకుకు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. దీంతో శంకరప్ప ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ బాధతోనే ఆత్మహత్య చేసుకోవాలని టీచర్ శంకరప్ప రెడ్డి నిర్ణయించుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

బెంగళూరు వచ్చి ఆత్మహత్య చేసుకున్న టీచర్

బెంగళూరు వచ్చి ఆత్మహత్య చేసుకున్న టీచర్

అసకాలంలో ఇచ్చిన రుణాలు చేతికి అందకపోవడంతో శంకరప్ప సతమతం అయ్యాడు. రాయచూరు జిల్లా సిందనూరు నుంచి బెంగళూరు వచ్చిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శంకరప్పమల్లేశ్వరం సమీపంలో రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రైలు పట్టాల సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సిటీ రైల్వేస్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం జేబులో ఉన్న డెత్ నోట్, ప్రభుత్వ స్కూల్ టీచర్ గుర్తింపు కార్డుల ద్వారా మృతుడు శంకరప్ప అని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.

ధర్నా కోసం వెలుతున్నానని భార్యకు చెప్పి ?

ధర్నా కోసం వెలుతున్నానని భార్యకు చెప్పి ?

వివిద డిమాండ్లు తీర్చాలని కర్ణాటకలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ బెంగళూరు చేరుకుని ఇక్కడి ఫ్రీడమ్ పార్క్ లో ధర్నా, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయుడు శంకరప్ప ధర్నాలో పాల్గొని తరువాత రాత్రి మల్లేశ్వరంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు.

డెత్ నోట్ లో నందిని పేరు

డెత్ నోట్ లో నందిని పేరు

శవకరప్ప చొక్కా జేబులో అతడు రాసిన రెండు పేజీల డెత్ నోట్ లభ్యమైందని పోలీసులు అన్నారు. ఇందులో ఆర్థిక సమస్యలు, పిల్లలు లేరనే బాధతో, నందిని అనే మహిళకు రూ. 28 లక్షలు ఇచ్చి మోసపోయాననని, తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిపెట్టాడని రైల్వే పోలీసులు తెలిపారు. డెత్ నోట్ లో నందిని పేరు ఉందని పోలీసులు అన్నారు. బెంగళూరులో నందిని ఎక్కడ ఉందని, ఆమె పుట్టు పూర్వాపరాల గురించిన వివరాలు ఆరా తీస్తున్నామని, శంకరప్ప కూడా కొద్దిరోజుల క్రితం ఆమెను రెండు మూడు సార్లు కలిశాడని, ఆత్మహత్యకు ప్రేరేపించిందని నందినిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని బెంగళూరు సిటీ రైల్వే పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఆన్ నైన్ గర్ల్ ఫ్రెండ్ కు రూ. 28 లక్షలు అప్పు చేసి ఇచ్చిన ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+