ఆన్‌లైన్‌లో మరోమోసం.. రూ. లక్ష ఐఫోన్‌కు బదులుగా మరోటి
ఫ్లిప్‌కార్ట్ వేదికగా మరోమోసం బయటకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ను వేదికగా మార్చుకుంటున్న ఆన్‌లైన్ వ్యాపారులు ,ఇతర కంపనీలు అనేక మోసాలకు తెరతీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడ ఫోన్లు, ఇతర వస్తువులు అర్డర్ చేసినవారికి రాళ్లు, ఇటుకలు వచ్చిన పరిస్థితి అనేక సార్లు వినియోగదారులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మరోమోసం వెలుగు చూసింది.
బెంగళూరుకు చెందిన రజనీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఐఫోన్ 11ప్రోను ఫ్లిప్‌కార్ట్‌లో అర్డర్ చేశాడు. ఇందుకోసం అక్షరాల 93,900 రూపాలయను చెల్లించాడు. అయితే ఇన్ని డబ్బులు చెల్లించి ఫోన్ అర్డర్ చేసిన ఆయనకు సదరు సంస్థ చుక్కలు చూపించింది. ఒరిజినల్‌కు బదులుగా నకిలీ ఫోన్‌ను పంపారు. ఫోన్ తెరిచి చూసిన రజనీకాంత్ అందులో స్క్రీన్‌తో పాటు సాఫ్ట్‌వేర్ కూడ ఐఓఎస్ కాదని చెప్పాడు. దీంతో అర్డర్‌ను తిరిగి వెనక్కిపంపినట్టు తెలిపాడు. అయితే ఇంతవరకు ఫోన్ తిరిగి ఇస్తామని చెబుతున్న ప్లిప్‌కార్ట్ సంస్థ ఎలాంటీ రీప్లేస్ కాలేదని ఆయన వెళ్లడించారు. ఇందుకోసం మరికొన్ని రోజులు వేచి చూసిన తర్వాత ఇతర చర్యలకు పూనుకుంటానని చెప్పాడు.

ఇలా ఇప్పుడిప్పుడే అన్‌లైన్ వ్యాపారాలు జోరందుకుంటున్న వేళ, కొద్దిమంది సెల్లర్లు చేసే తప్పిదాలు, మోసాల వల్ల వినియోగదారుల్లో ఆన్‌లైన్ సంస్థలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. దీంతో సాంకేతికంగా పెద్దగా అవగాహన లేని వాళ్లు సంస్థలు చేస్తున్న మోసాలకు బలి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications