వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బిజినెస్ స్కూల్ విద్యార్థులకు తగ్గిన జాబ్స్, కేవలం 20% మందికే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిజినెస్ స్కూల్స్ విద్యార్థుల్లో కేవలం 20 శాతం మందికే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని అసోచామ్ అంచనా వేసింది. బిజినెస్ స్కూల్స్ లో ప్లేస్‌మెంట్స్ కోసం గతంలో ఏనాడు లేని విధంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అసోచామ్ అభిప్రాయపడింది.

బిజినెస్ స్కూళ్ళలో ప్లేస్ మెంట్స్ పై అనేక అంశాలు ప్రభావం చూపాయని అసోచామ్ అభిప్రాయపడింది.గతంతో పోలిస్తే బిజినెస్ స్కూళ్ళ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

శుభవార్త: మీడియా, వినోద రంగాల్లో 8 లక్షల మందికి ఉద్యోగాలుశుభవార్త: మీడియా, వినోద రంగాల్లో 8 లక్షల మందికి ఉద్యోగాలు

బిజినెస్ స్కూల్ విద్యార్థులకు జాబ్స్ తక్కువ

బిజినెస్ స్కూల్ విద్యార్థులకు జాబ్స్ తక్కువ


బిజినెస్ స్కూళ్ళ ప్లేస్‌మెంట్ల విషయంలో గతంలో ఏనాడూ లేని విధంగా గడ్డు పరిస్థితులున్నాయని అసోచామ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.బిజినెస్‌ స్కూల్‌ విద్యార్ధుల్లో కేవలం 20 శాతం మందికే జాబ్‌ ఆఫర్లు వస్తున్నాయని అసోచామ్ అభిప్రాయపడింది.

ఉద్యోగావకాశాలు తగ్గడానికి కారణమిదే

ఉద్యోగావకాశాలు తగ్గడానికి కారణమిదే


బిజినెస్‌ స్కూల్‌ విద్యార్ధుల్లో కేవలం 20 శాతం మందికే ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితికి అనేక కారణాలు దోహదపడుతున్నాయని అసోచామ్ అభిప్రాయపడింది.నోట్ల రద్దు, నిరుత్సాహకర వ్యాపార వాతావరణం, నూతన ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి కారణాలతో బీ స్కూల్‌ విద్యార్ధులకు జాబ్‌ ఆఫర్లు తగ్గిపోయాయని అసోచామ్‌ అభిప్రాయపడింది.

వేతన ప్యాకేజీలు తక్కువ

వేతన ప్యాకేజీలు తక్కువ

గత ఏడాది బీ స్కూల్‌ ప్లేస్‌మెంట్‌ 30 శాతంగా ఉంటే ఇప్పుడు 20 శాతం బీ స్కూల్‌ విద్యార్థులకే జాబ్‌ ఆఫర్లు పరిమితమయ్యాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వేతన ప్యాకేజీలు కూడా 40-45 శాతం తక్కువగా ఉన్నాయని వివరించింది.

బిజినెస్ స్కూళ్ళ పరిస్థితి ఇలా

బిజినెస్ స్కూళ్ళ పరిస్థితి ఇలా

మూడు నాలుగేళ్ల సమయం వెచ్చించి రూ లక్షలు ఖర్చు చేయడంపై తల్లితండ్రులు, విద్యార్ధులు పునరాలోచిస్తున్నారని కూడా అసోచామ్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (ఏఈసీ) తెలిపింది. 400 విద్యా సంస్థల్లో తగినంత విద్యార్ధులు లేకపోవడంతో ఆయా సంస్థల మనుగడ ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేసింది. 2015 నుంచి ఇప్పటివరుకూ 250 పైగా బిజినెస్‌ స్కూళ్లు మూతపడ్డాయని వెల్లడించింది.

English summary
Business schools are struggling hard for placements with only 20 per cent students landing job offers, making this placement year the most challenging in recent times, according to Assocham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X