45 ఏళ్లలో నిరుద్యోగ సమస్య అత్యధికం: రాహుల్ గాంధీ, బీజేపీ ధీటైన కౌంటర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆ పదవి నుంచి దిగిపోయే సమయం వచ్చిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం విమర్శలు గుప్పంచారు. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అత్యధికంగా 2017-18లో నమోదయిందని జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) తెలిపిందని పేర్కొన్నారు.

మోడీ ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ ఏమైందన్నారు. నమో జాబ్స్‌.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఓ నిరంకుశ నేత హామీ ఇచ్చారని, ఐదేళ్లు గడిచాయని, ఉద్యోగాల విషయంలో బయటకు వచ్చిన ఈ నివేదిక ఓ జాతీయ విపత్తు వంటి పరిస్థితిని సూచిస్తోందని, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా నిరుద్యోగం ఉందని, 6.5 కోట్ల మంది యువత 2017-18 కాలంలో నిరుద్యోగులుగా మిగిలారని, 'నమో' ఇక వెళ్లు అనాల్సిన సమయం వచ్చిందని రాహుల్ అన్నారు.

Only a jobless man can peddle the fake jobs report: BJP to Rahul Gandhi

దేశ యువత భవిష్యత్తును మోడీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. మోడీజీ... ఇప్పుడు నిరుద్యోగ రేటు.. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా ఉన్నట్లు నమోదయిందని, అందుకే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికను బయటకు రాకుండా ఇన్ని రోజులు దాచారని, అందుకే, జాతీయ గణాంక సంఘం (ఎన్‌ఎస్‌సీ)‌ సభ్యులు రాజీనామా చేశారని మండిపడ్డారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాని హామీ ఇప్పుడు క్రూరమైన జోక్‌గా మారిందన్నారు. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసే ప్రభుత్వం భారత్‌కు వద్దని పేర్కొన్నారు.

బీజేపీ కౌంటర్

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఉద్యోగాల విషయంలో చేసిన కామెంట్స్ పైన బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈపీఎఫ్ఓ వాస్తవ డేటా ప్రకారం ఉద్యోగాలు పెరిగాయని చెప్పారు. రాహుల్ ఎప్పుడైనా అసలు ఉద్యోగం చేశారా అని ప్రశ్నించింది. ఉద్యోగం లేని ఓ నేత (రాహుల్ గాంధీ) తప్పుడు రిపోర్టుతో ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముసోలిని లాగే రాహుల్ గాంధీకి షార్ట్ సైటెడ్‌నెస్ ఉందని ఎద్దేవా చేశారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చెప్పిన జాబ్ డేటా రిపోర్టును వ్యతిరేకించారు. అసలు జాబ్ డేటా ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఇప్పుడు మీడియాలో వస్తున్నది తుది నివేదిక కాదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+