వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్సిజం: ఫేస్‌బుక్‌పై మాజీ మహిళా ఉద్యోగి సంచలనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ మహిళా మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలు ఫేస్‌బుక్ కంపెనీని కాస్తంత ఇబ్బందుల్లోకి పడేశాయి. మంచి జీతం, ఉచిత భోజనం, అన్నింటి కంటే ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీగా ఫేస్‌బుక్‌ను అందరూ భావిస్తుంటారు.

అయితే ఫేస్‌బుక్‌లో పని వాతావరణం ఊహించిన దాని కంటే ఎంతో భిన్నంగా ఉంటుందని ఆ సంస్ధ మాజీ మహిళా ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కోపం, నిరుత్సాహం, మాట్లాడడానికి విల్లేని విధంగా ఫేస్‌బుక్ వాతావరణం ఉంటుందని ఫేస్‌బుక్ ట్రెం‌డింగ్ టీమ్‌లో కాంట్రాక్టర్ ఉద్యోగిగా పనిచేసిన మహిళా ఉద్యోగి దిగ్బ్రాంతికర విషయాలు చెప్పింది.

గతంలో ఫేస్‌బుక్‌లో న్యూస్ క్యూరేటర్‌గా పని చేసిన ఆ మహిళా ఉద్యోగి భయం, పక్షపాతం, లింగ వివక్ష కారణంగా ఒక్క 2014లో 40 నుంచి 50 మంది వరకు ఉండే ట్రెండింగ్ టీమ్ ఉద్యోగుల్లో 15 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారని పేర్కొంది. అందులో 10 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది.

'Only men encouraged to speak': Ex-employee accuses FB of sexism

పూర్ మేనేజ్‌మెంట్, ఫేవరేటిజం, సెక్సిజం కారణంగా వీరంతా తమ ఉద్యోగాలకు రాజీమా చేసినట్లు ఆమె పేర్కొంది. ట్రెండింగ్ టీమ్‌లో 10 మంది మహిళలు ఉండేవారని, కానీ ఎక్కువగా మగాళ్లనే ప్రోత్సహిస్తుంటారని 'గార్డియన్' పత్రికకు ఇంటర్యూలో ఆమె చెప్పారు. మగాళ్లు మాట్లాడుతున్నప్పుడు తామంతా నోరు తెరవడానికి వీల్లేదన్నారు.

ముఖ్యంగా మహిళా ఉద్యోగులను మేనేజర్లు, ఎడిటర్లు వేధిస్తుంటారని ఆమె చెప్పారు. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయ పక్షపాతం లేదని వెల్లడించారు. ట్విట్టర్ వాడకుండా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారని వెల్లడించారు. ట్రెండింగ్ సెక్షన్‌లో మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ పేరు వాడినా అందుకు జరిమనా విధిస్తారని పేర్కొంది.

ఎలాంటి షెడ్యూల్, సమాచారం ఇవ్వకుండానే టార్గెట్ సాధన కోసం ఒత్తిడి తీసుకొస్తారని ఆమె వివరించారు. పేస్‌బుక్ ఇంటర్నల్ టీమ్స్ చెప్పినట్టుగా నడుచుకోకపోతే అప్పుడప్పుడు ఓవర్ నైట్ షిప్టులను శిక్ష విధిస్తారని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఫేస్‌బుక్ యాజమాన్యం స్పందించింది. ఆమె లేవనెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవని, వాటిని దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది.

English summary
Social media juggernaut Facebook , which was in the spotlight recently for its 'Trending News' controversy, seems to have landed in a deeper trouble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X