కరోనా రోగులకు కేంద్రం ఊరట- తీవ్ర కేసుల్లోనే డిశ్చార్జ్ కు ముందు పరీక్షలు..

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో కరోనా పరీక్షల నిర్వహణతో పాటు వాటిని ఎప్పుడెప్పుడు నిర్వహించాలో కూడా స్పష్టం చేసింది. వీటిని పాటించాలని ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. వీటిని బట్టి చూస్తే ప్రభుత్వం కరోనా మహమ్మారిపై ప్రజల్లో భయాందోళనలను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

    Covid-19 : Govt Revises Discharge Policy For Corona Patients
     కరోనా పరీక్షలు ఇక తప్పనిసరి కాదు...

    కరోనా పరీక్షలు ఇక తప్పనిసరి కాదు...

    దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా వైరస్ భయాలు ఓవైపు... మరోవైపు భారీగా నిర్వహిస్తున్న పరీక్షలు.. ఈ రెండు కారణాలను విశ్లేషించిన తర్వాత కేంద్రం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. వీటి ఆధారంగా కరోనా పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలకు కొత్త మార్దదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై కరోనా తీవ్రత ఉన్న కేసుల్లో మాత్రమే కోలుకున్నాక డిశ్చార్జ్ కు ముందు ఓసారి మాత్రమే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. తీవ్రత తక్కువగా ఉన్న, లేక సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్న కేసుల్లో డిశ్చార్జ్ కు ముందు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.

     ఇప్పటివరకూ జరుగుతోంది ఇదీ...

    ఇప్పటివరకూ జరుగుతోంది ఇదీ...

    ఇప్పటివరకూ కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రులతో చేరుతున్న వారి శాంపిల్స్ తీసుకుని 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఆర్టీ పీసీఆర్ స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలితే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇలా ప్రతీ ఒక్కరికీ టెస్టుల నిర్వహణ ఆర్ధికంగానూ భారంగా మారుతోంది. అదే సమయంలో ప్రజల్లో భయాందోళనలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం తాజా మార్గదర్శకాల్లో ఈ నిబంధనను మార్చింది.

     మౌలిక వసతుల కరవు, ఆర్ధికంగానూ భారమే..

    మౌలిక వసతుల కరవు, ఆర్ధికంగానూ భారమే..

    గత వారం దేశవ్యాప్తంగా 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల రెట్టింపు తీవ్రత కూడా పెరుగుతోంది. అయితే వాటికి తగినంత స్ధాయిలో ఆస్పత్రులు, బెడ్లు ఉన్నాయా అంటే ఎవరి వద్దా సమాధానం లేదు. దీంతో తీవ్రమైన కేసుల్లో మాత్రమే టెస్టులు నిర్వహించేలా మిగిలిన వారికి డిశ్చార్జ్ తర్వాత ఏవైనా సమస్యలుంటే హోం క్వారంటైన్ నిర్వహించేలా కేంద్రం మార్గదర్శకాల్లో సవరణలు చేసింది. ఓసారి కరోనా లక్షణాలు బయటపడిన పది రోజుల తర్వాత చికిత్స అందిస్తూనే మూడు రోజుల పాటు ఎలాంటి జ్వరం రాకపోతే తీవ్రత లేని కేసుల్లో పరీక్షలు నిర్వహించకుండానే డిశ్చార్జ్ చేసే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. అలాగే ఓసారి ఆస్పత్రులకు వచ్చి కోలుకున్నాక, 95 శాతం కంటే ఎక్కువగా శ్వాస ఆడుతుంటే వీరిని తీవ్రత తక్కువగా ఉన్న కేసులుగా నిర్ధారించవచ్చని కేంద్రం తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+