దేశంలో తొలిసారి: పుట్టిన 18 గంటలకే ఓపెన్ హార్ట్ సర్జరీ
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి ఓ నవజాత శిశువుకు ఓపెన్‌హార్ట్ సర్జరీ జరిగింది. పుట్టిన 18 గంటల వ్యవధిలోనే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆ సర్జరీ జరిగింది. మాయంక్ అగర్వాల్ అనే ఈ నవజాత శిశువుకు పుట్టుకతోనే గుండెజబ్బు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధిని ఊపిరితిత్తులకు సంబంధించి అపసవ్య విధానంగా నిర్థారించారు.
మామూలుగా ఊపిరితిత్తులనుంచి గుండెకు, శరీరంలోని ఇతర భాగాలకు సాధారణంగా జరిగే రక్తప్రసరణ దీనివల్ల జరిగే ఆస్కారం ఉండదు. ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాలు అసాధారణ స్థితిలో గుండెకు సంధానమై ఉంటాయి. దీనివల్ల రక్తప్రసరణ సక్రమంగా లేక నాళాల్లోనే అది గడ్డ కడుతుంది.

అలాగే రక్తంద్వారా జరిగే ఆక్సిజన్ సరఫరా సక్రమంగా ఉండదు. ఈ రక్తం లీక్ కావడమో లేదా శరీరంలోని మరో భాగానికి చేరడమో జరుగుతుంది. ఇది కూడా ఊపిరితిత్తుల్లోనే రక్తం ఆగిపోవడానికి దారితీస్తుంది. అంటే బృహద్ధమనుల ద్వారా శరీరానికి ప్రసరణ అయ్యే రక్తంలో మామూలుగా ఉండే ఆక్సిజన్ ఉండదు. దీనివల్ల సదరు శిశువుకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
ఇలాంటి స్థితినే మాయంక్ అనే నవజాత శిశువు ఎదుర్కొంటోందని, ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారానే దీనికి అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె.ఎస్.అయ్యర్ తెలిపారు. జన్మించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మాయంక్‌కు ఊపిరితీసుకోవడం కష్టమైంది. స్థానికంగా వైద్యులు ఎంత ప్రయత్నించినా దీన్ని నయం చేయలేకపోవడంతో ఢిల్లీకి తీసుకొచ్చారు.
అనంతరం ఓపెన్ హార్ట్ సర్జరీయే శరణ్యమని భావించడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అంటే కండరాలు, గుండె కవటాలను సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం కేవలం 18 గంటల నవజాత శిశువుకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరపడమన్నది వైద్యపరంగా సాధించిన నైపుణ్యానికి నిదర్శనం.












Click it and Unblock the Notifications