బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ONDC: అందుబాటులోకి ఓఎన్డీసీ బీటా వర్షన్ సేవలు.. ఇక అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ లకు గడ్డుకాలమే..!

|
Google Oneindia TeluguNews

ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ONDC)సేవలు బెంగళూరు వాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఇ-కామర్స్‌ వేదికలకు దీటుగా చిన్న వ్యాపారులకు మేలు జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని 16 పిన్‌కోడ్స్‌లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి ఉన్నాయి. దేశంలో ONDC సేవలు అందుబాటులోకి వచ్చిన నగరంగా బెంగళూరు నిలిచింది.

బీటా టెస్టింగ్‌

బీటా టెస్టింగ్‌


బీటా టెస్టింగ్‌లో భాగంగా ప్రజలు ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ బీటా వర్షన్ సేవలను త్వరలో ఢిల్లీ, షిల్లాంగ్, భోపాల్, కోయంబోత్తూరులో అందుబాటులోకి తెనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిత్యావసర సరకులు, రెస్టారెంట్స్‌

నిత్యావసర సరకులు, రెస్టారెంట్స్‌


ప్రస్తుతం ఓఎన్‌డీసీ ద్వారా నిత్యావసర సరకులు, రెస్టారెంట్స్‌ విభాగాల్లో బెంగళూరు వాసులు సేవలను వాడుకోవచ్చు. ఈ రెండు విభాగాల్లో తమకు నచ్చిన అప్లికేషన్‌ను వినియోగదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మైస్టోర్‌, పేటీఎం, స్పైస్‌ మనీ యాప్స్‌ అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఐటీసీ స్టోర్‌, కోటక్‌ బ్యాంక్‌, మ్యాజిక్‌ పిన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫోన్‌ పే, జోహో వంటి యాప్స్‌ కూడా ఇందులో అందుబాటులోకి రానున్నాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌


ప్రస్తుతం దేశంలో ఇ-కామర్స్‌ మార్కెట్ లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ హవా కొనసాగుతోంది. కొవిడ్‌ పరిణామాలతో వేసుకునే బట్టల నుంచి అన్నీ ఆన్ లైన్ లో బుక్ చేస్తున్నారు. దీంతో చిరు వ్యాపారుల భవితవ్యం అనిశ్చితిలో పడింది. ఇది గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్‌లైన్‌లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ


ప్రధాని మోదీ సూచన మేరకు నందన్‌ నీలేకని, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్‌డీసీ రూపొందించారు. ఈ ప్లాట్ ఫారమ్ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చని అధికారులు తెలిపారు.

English summary
Open Network for Digital Commerce services are now available to the people of Bangalore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X