Operation Clean Ayodhya: అత్యంత పరిశుభ్రంగా అయోధ్య నగరం-ప్రాణప్రతిష్ట వేళ డ్రైవ్..!
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతే స్ధాయిలో నగరంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కూడా కొనసాగుతోంది. జనవరి 22న పలువురు దేశ విదేశీ ప్రముఖుల సమక్షంలో రామాలయంలో ప్రాణప్రతిష్ట జరగబోతోంది. ఈ మహాఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది అయోధ్యకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు యూపీ సర్కార్ చర్యలు చేపట్టింది.
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట జరిగే సమయాన్ని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు యూపీ సర్కార్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఏర్పాట్లలో 500 తాత్కాలిక మరుగుదొడ్లు, 30 మొబైల్ టాయిలెట్లు, అదనంగా 1,500 సఫాయి మిత్రలు, 50 మేళా సార్తీలు (గైడ్‌లు), 22 వాటర్ కియోస్క్‌లు, 50 వాటర్ ట్యాంకులు, రెండు తాత్కాలిక ఆసుపత్రులు, 16 ప్రాథమిక ఆరోగ్య శిబిరాలు, 62 అంబులెన్స్‌లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

12 అధునాతన లైఫ్ సపోర్ట్ వాహనాలు, 200 మందికి పైగా వైద్యులు, అయోధ్య నుండి లక్నో వరకు రెస్క్యూ, వైద్య సేవలపై విస్తృతమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. తాత్కాలిక అవుట్‌సోర్సింగ్‌తో పాటు, కాన్పూర్, సుల్తాన్‌పూర్, లక్నో, బస్తీ, బహ్రైచ్, వారణాసి వంటి వివిధ శాఖలు, జిల్లాల అధికారులను కూడా అయోధ్యలో రద్దీ, ట్రాఫిక్ నిర్వహణ, సందర్శకుల సౌకర్యార్థం మోహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications