వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ దేవ్ శక్తి: ఆప్ఘన్‌లో ఉన్న ఇండియన్స్ తరలించే మిషన్: విదేశాంగ శాఖ

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆటవిక పాలన కంటిన్యూ అవుతోంది. ఇప్పటికీ ఆ దేశంలో కొందరు చిక్కి ఉన్నారు. వారిని స్వదేశాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ కూడా ఆ పనిలో నిమగ్నమయ్యింది.ఆప్ఘన్‌లో చిక్కుకొన్న భారతీయులను తీసుకొచ్చేందుకు 'ఆపరేషన్ దేవ్ శక్తి' పేరుతో కేంద్రం మిషన్ చేపట్టింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి జై శంకర్ పేరును వెల్లడించారు. ఇవాళ 78 మంది ఆప్ఘన్ నుంచి భారతీయులు ఢిల్లీ చేరుకున్నారని ఆయన ట్వీట్ చేశారు.

78 మంది..

78 మంది..

78 మందిని భారత వాయుసేన తీసుకొచ్చింది. కాబూల్ వయా దుసాంబే మీదుగా విమానం ఢిల్లీ చేరింది. ఈ నెల 16వ తేదీన కూడా 40 మంది భారతీయులను తరలించారు. అప్పటినుంచి ఇప్పటివరకు 800 మందిని ఇండియా తీసుకొచ్చారు. అలాగే ఇతర దేశాలు కూడా తమ ప్రజలకు తీసుకెళ్లాయి. గత వారం రోజుల నుంచి కాబుల్ ఎయిర్ పోర్టు జనం రద్దీ కొనసాగుతోంది. వారు ఇతర దేశాలకు వెళ్లేందుకు గుమిగూడారు.

అందరినీ తరలింపు

అందరినీ తరలింపు

ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆప్ఘన్‌లో ఉన్న ప్రజలను సురక్షితంగా తరలించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆప్ఘన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు స్వదేశం వస్తామని స్పష్టంచేశారు. 17వ తేదీ నుంచి భారత రాయబార కార్యాలయం ఇండియన్స్ తరలింపుపై ఫోకస్ చేసింది. మంగళవారం 78 మంది ఉన్నారు. వీరిలో 25 మంది ఆప్ఘన్ సిక్కులు, దుసాంబెకు చెందిన హిందువులు ఉన్నారు.

600 మంది ఒకే విమానంలో

600 మంది ఒకే విమానంలో

ఆప్ఘన్‌లో తాలిబాన్ల ఆటవిక పాలన కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉండలేక వెళ్లేందుకు జనం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ విమానంలో దాదాపు 600 మంది పైచిలుకు ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయానికి ఇటీవల వేలాదిమంది వచ్చారు. విమానం రెక్కలపై కూర్చుని అయినా దేశం దాటాలని ప్రయత్నించి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోటెత్తిన జనాన్ని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో మరికొందరు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. వేలాదిమంది విమానాశ్రయం బయట ప్రతి రోజూ పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాయల్ మెరైన్‌కు చెందిన యూకే మాజీ కామాండో పాల్ 'పెన్' ఫార్తింగ్ తన భార్య కైసా‌ను ఖాళీ విమానంలో తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనే ఈ ఫొటోలను షేర్ చేశారు. ఆమె ప్రయాణించిన 'సి-11 గ్లోబ్‌మాస్టర్' మిలటరీ విమానం ఖాళీగా ఉంది.

English summary
Ministry of External Affairs on Tuesday announced 'Operation Devi Shakti' to be the new moniker of India's complex mission to evacuate its citizens and Afghan partners from Kabul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X