వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు - కొంప ముంచిందెవరు : మిత్రపక్షాలు నిలుస్తాయా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి ఏమైంది. రాజకీయ సీనియర్లు..మేధావులు ఉన్న పార్టీలో ఏం జరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ రాష్ట్రాల్లోనూ ప్రాభవం కోల్పోతోంది. 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా ఉంది. కేవలం 6 స్థానాలకు పరిమితం అయింది. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల బాధ్యత ప్రియాంకకు అప్పగించారు. ఈ సారి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తామని చెప్పుకొచ్చారు.

సోషల్ ఇంజనీరింగ్ లో కాంగ్రెస్ ఫెయిల్

సోషల్ ఇంజనీరింగ్ లో కాంగ్రెస్ ఫెయిల్


రైతుల పోరాటం.. అక్కడ జరిగిన పరిణామాలు..ప్రధాని మోదీ - యోగీ నిర్ణయాలు అనుకూలంగా మలచు కోవటం లో కాంగ్రెస్ విఫలమైంది. ఓబీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటంతో పాటుగా.. టిక్కెట్ల కేటాయింపు - పొత్తుల విషయంలో ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ లో వైఫల్యం చెందింది. ఫలితంగా అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో నామమాత్రంగా మిగిలింది. ఫీల్డ్ ను బీజేపీకి వదిలేసింది. యూపీలో అయిదో స్థానానికి పరిమితం అయింది. బీజేపీ..ఎస్పీ..బీఎస్పీ..ఆర్ఎల్డీ తరువాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. అధికారంలో ఉన్న పంజాబ్ ను కాంగ్రెస్ కోల్పోయింది. అక్కడ 2017 ఎన్నికల్లో 77 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పూర్తిగా స్వీయ తప్పిదాలతో ఆప్ కు అధికారం అప్పగించాల్సి వచ్చింది.

పంజాబ్ లో కొంప ముంచిన సిద్దూ

పంజాబ్ లో కొంప ముంచిన సిద్దూ

పంజాబ్ లో పార్టీలో సిద్దూ రంగ ప్రవేశం.. సిద్దూ మాటకు టెన్ జన్ పథ్ ప్రాధాన్యత ఇవ్వటంతో రాష్ట్రంలోని సీనియర్లు రగిలిపోయారు. సిద్దూ పైన కోపం పార్టీ పైన చూపించారు. ముఖ్యమంత్రిగా చన్నీని ఎంపిక చేయటం ద్వారా తమకు సామాజిక సమీకరణాల్లో కలిసి వస్తుందని వేసిన అంచనాలు తల కిందులయ్యాయి. చన్నీ పార్టీ గెలిస్తే సీఎంగా కొనసాగుతారని రాహుల్ చేసిన ప్రకటన సీనియర్లకు రుచించలేదు. ఇదే సమయంలో అమరీందర్ పార్టీని వీడటం కూడా నష్టం చేసింది. సిద్దూ వ్యతిరేకులు..అనుకూలురుగా పార్టీ నేతలు విడిపోయారు. ఫలితంగా ఆప్ పెట్టిన కొత్త అభ్యర్ధుల చేతిలో పేరున్న నేతలు పరాజయం పాలయ్యారు. ఫలితంగా కాంగ్రెస్ 15 సీట్లకు పరిమితం కావాల్సి వస్తోంది.

చొరవ చూపని కాంగ్రెస్ సీనియర్లు

చొరవ చూపని కాంగ్రెస్ సీనియర్లు

2017 ఎన్నికల ఫలితాలు..తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ లో వ్యూహాలు లోపించాయి. జాతీయ స్థాయి నేతలు ఎన్నికల ముందు అక్కడ ఫోకస్ పెట్టలేదు. ఎగ్జిట్ పోల్స్ తరువాత గోవా.. ఉత్తరాఖండ్ కు పరిగెత్తిన కాంగ్రెస్ నేతలు పోలింగ్ ముందు వ్యూహ రచనలో మాత్రం ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఈశాన్య రాష్ట్ర మైన మణిపూర్ లోనూ బీజేపీ అధికారికంగా ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అదే విధంగా గోవాలోనూ వ్యూహాలు లోపించాయి. కనీసం టీఎంసీ - మిత్రపక్షాలు 5 స్థానాలతో ఇప్పుడు అక్కడ కింగ్ మేకర్ గా అవతరిస్తున్నారు.

అంతర్గత కలహాలతో ఆ రాష్ట్రాల్లో

అంతర్గత కలహాలతో ఆ రాష్ట్రాల్లో

గోవాలో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవటం ఇప్పుడు కాంగ్రెస్ కు సవాల్ గా మారుతోంది. ఉత్తరాఖండ్ లోనూ ఉన్న అవకాశాలను కాంగ్రెస్ విడిచిపెట్టుకుంది. అక్కడ బీజేపీ నాయకత్వ మార్పును అనుకూలంగా మార్చుకోవాల్సిన వేళ.. సొంత సమస్యలతో పార్టీ దెబ్బ తింది. ఫలితంగా హంగ్ వస్తుందని అంచనా వేసిన ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ 23 సీట్లకు పరిమితం అవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాకముందే జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు మొదలయ్యాయి.

Recommended Video

Punjab Election Results 2022: AAP Crosses Majority Mark In Early Trends | Oneindia Telugu
మిత్రపక్షాలు కాంగ్రెస్ తో నిలుస్తాయా

మిత్రపక్షాలు కాంగ్రెస్ తో నిలుస్తాయా

కాంగ్రెస్ మద్దతు కూటమి..కాంగ్రెస్ రహిత కూటమి అంటూ చర్చలు ప్రారంభం అయ్యాయి. అయితే, యూపీఏలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు ఇప్పటికీ కొన్ని కాంగ్రెస్ తోనే కొనసాగుతున్నాయి. కానీ, బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో కాదని.. సొంత కూటమి తప్పదనే చర్చను ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా లాంటి వారు ప్రారంభించారు. దీంతో..రానున్న రోజుల్లో రాజకీయంగా కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో.. జాతీయ స్థాయిలో ఎటువంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.


English summary
Congress had faced a debacle in major states and needs introspect as what went wrong with allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X