తర్వాతి ప్రధాని 'యోగి'నే: భవిష్యత్తులో మోడీని మించిపోతారు.. 'హర్ హర్ యోగి'

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాథ్ యోగికి హిందూ మతాధిపతుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో భవిష్యత్తు ప్రధాని అంటూ వారు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధాని మోడీని మించిపోయే రీతిలో ఆయన భవిష్యత్తు ఎదుగుదల ఉంటుందంటూ పలువరు హిందూ మతాధిపతులు ఆకాంక్షిస్తున్నారు.

ఐదు సార్లు వరుసగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై, ఆపై ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ తదుపరి లక్ష్యం దేశానికి ప్రధాని కావడమేనని.. దానికి అంతా సిద్దమవుతోందంటూ ఆదిత్యానాథ్ యోగి అనుచరగణం, తోటి హిందూ మతాధిపతులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ 2019లోను ప్రధానిగా ఎన్నికవుతారని, కానీ ఆ తర్వాతి రోజుల్లో మోడీ కన్నా ఆదిత్యానాథ్ కు పలుకుబడి పెరుగుతుందని ఆదిత్యానాథ్ యోగి సన్నిహితుడు ఒకరు తెలిపారు. 2024నాటికి మోడీని మించిపోయే రీతిలో ఆదిత్యానాథ్ పేరు తెచ్చుకంటారని, ఆపై ఆయనే ప్రధాన నేత అవుతారని అన్నారు.

Opinion :Is Yogi Adityanath a candidate to succeed Narendra Modi in the future?

ఇక కుమారుడి ఎదుగదలపై ఆదిత్యానాథ్ యోగి తండ్రి ఆనంద్ సింగ్ బాసిత్ సంతోషం వ్యక్తం చేశారు. తన కొడుకు ఏదో ఒక రోజు దేశానికి అధినేతగా మారుతారని అన్నారు. ప్రస్తుతం దేశంలోని ఓ ముఖ్యమైన రాష్ట్రానికి సీఎంగా ఉన్న ఆయన త్వరలోనే దేశం మొత్తాన్ని నడిపే నాయకత్వాన్ని సంతరించుకుంటారన్న నమ్మకం ఉందన్నారు.

కాగా, ఆదివారం నాడు జరిగిన ప్రమాణస్వీకారం సందర్బంగా 'హర్ హర్ యోగి' అన్న నినాదాలు మారుమోగాయి. సాధారణంగా మోడీని ఉద్దేశించి చేసే 'హర్ హర్ మోడీ' నినాదాలు ఇప్పుడు యోగి విషయంలోను పోటాపోటీగా కనిపిస్తుండటం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Uttar Pradesh chief minister Yogi Adityanath was today compared to the Pope and declared a future Prime Minister by his admirers and aides on his home turf of Gorakhpur.
Please Wait while comments are loading...