హిజాబ్ వివాదంపై అమిత్ షా ప్రకటనకు విపక్షాల పట్టు-లోక్ సభ నుంచి వాకౌట్
కర్నాటకలోని మాండ్యా జిల్లాలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చిన ముస్లిం యువతిని జైశ్రీరాం నినాదాలతో యువకులు టార్గెట్ చేయడంపై చర్చ జరుగుతోంది. దీంతో స్పందించిన కర్నాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు రాష్ట్రంలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించేసింది. మరోవైపు కర్నాటక హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై రెండురోజులుగా విచారణ జరుపుతోంది.
Recommended Video
కర్నాటకలో హిజాబ్ ను వివాదాస్పదంగా మార్చిన వ్యవహారం, ప్రభుత్వ నిర్ణయాలపై నిన్నటి నుంచి లోక్ సభలో విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. నిన్న కేంద్రం చర్చకు అంగీకరించకపోవడంతో విపక్ష ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. ఇవాళ కూడా అదే సీన్ రిపీటయింది. హిజాబ్ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు వివక్షాలు పట్టుబట్టాయి. కానీ కేంద్రం మాత్రం దీనిపై స్పందించలేదు. దీంతో విపక్ష ఎంపీలు ఇవాళ కూడా లోక్ సభ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలిపారు.

హిజాబ్ పేరుతో ముస్లిం యువతులపై అకృత్యాలు చేస్తున్నారని లోక్ సభ జీవో అవర్ లో విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై హోంమంత్రి అమిత్ షా ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. అయితే బీజేపీ ఎంపీలు మాత్రం ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశమని, దీనిపై లోక్ సభలో చర్చిస్తే అది సబ్ జుడీస్ అవుతుందని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో, కర్ణాటకలోని ధార్వాడ్ ఎంపీ అయిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభ వెలుపల దీనిపై స్పందించారు. విద్యార్థులందరూ విద్యాసంస్ధలు, అధికారులు సూచించిన దుస్తుల కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని, విద్యార్థులను రెచ్చగొట్టే వ్యక్తులు ఎవరో చూడాలన్నారు.












Click it and Unblock the Notifications