బెంగళూరులో విపక్షాల కీలక భేటీ: పవార్ మినహా హాజరైన పలు పార్టీల అగ్రనేతలు
బెంగళూరు: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బెంగళూరులో తలపెట్టిన విపక్షాల కూటమి కీలక భేటీ సోమవారం రాత్రి జరిగింది. సుమారు రెండు గంటలపాటు సాగింది ఈ భేటీ. పలు కీలక అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఈ భేటీకి పలు పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. సామాజిక న్యాయం కోసం భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్ని కలిసి పనిచేస్తాయని భేటీ అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఈ రోజు సగం మంచి పని పూర్తయిందన్నారు.
ఈ భేటీకి ముందు సమావేశం ప్రాంగణానికి చేరుకున్న నేతలందరికీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సాదరంగా స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొవడంతోపాటు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో కీలకంగా చర్చించినట్లు తెలిసింది. రేపు అంటే మంగళవారం మరోసారి భేటీ కానున్నారు.
ఇప్పటికే ఒకసారి బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాలు సమావేశమైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని ఎన్సీపీలో తిరుగుబాటు, పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హింసకు టీఎంసీనే కారణమంటూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా, బెంగళూరులో జరుగుతున్న ఈ విపక్షాల కీలక భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతోపాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, బీహార్ సీఎం, జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్, ఆర్డీజే అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపీ కూడా హాజరయ్యారు.
Opposition leaders' dinner meeting gets underway in Karnataka's Bengaluru pic.twitter.com/HENPkecg1g
— ANI (@ANI) July 17, 2023
వీరితోపాటు మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే, జార్ఖండ్ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, డీఎండీకే ప్రధాన కార్యదర్శి వైకో తోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. కాగా, బెంగళూరు వేదికగా జరుగుతున్న విపక్షాల తొలిరోజు భేటీకి ఎన్సీ అధినేత శరద్ పవార్ హాజరు కాలేదు.
"Like-minded opposition parties shall closely work together to foster an agenda of social justice, inclusive development and national welfare," says Congress President Mallikarjun Kharge after Opposition leaders' dinner meeting in Bengaluru. pic.twitter.com/H27D4nL1iU
— ANI (@ANI) July 17, 2023
అయితే, రెండో రోజు విపక్షాల భేటీకి తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి శరద్ పవార్ హాజరవుతారని ఎన్సీపీ స్పష్టతనిచ్చింది. తొలిరోజు భేటీకి హాజరుకాకపోవడానికి గల కారణాలు మాత్రం చెప్పలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తన వర్గం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసేందుకే పవర్ ముంబైలో ఉండిపోయినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ హాజరుపై అనుమానాలున్నా.. వారిద్దరూ ఈ భేటీకి హాజరు కావడం గమనార్హం. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ఆప్ సర్కారుకు మద్దతివ్వడంతో కేజ్రీవాల్ ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications