Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం- వేడెక్కిన ఢిల్లీ: రాత్రికి రాత్రి అనూహ్యం: ప్రతిపక్షాల ధీమా అదే

న్యూఢిల్లీ: మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.

మే 3వ తేదీన మణిపూర్‌లో మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 150 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ హింసాత్మక పరిస్థితులకు అడ్డుకట్ట పడట్లేదు. దాడులు, ప్రతిదాడులతో తగలబడుతూనే ఉంది మణిపూర్.

Parliament

ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది.

దీనిపై రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ గళమెత్తారు. మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో ఆయన వెల్‌లోకి దూసుకెళ్లారు. ఛైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ఆదేశించినా.. వెన‌క్కి వెళ్ల‌లేదు. ఫలితంగా సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.

Adhir Ranjan Chowdhury

మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో చర్చించడం, సంజయ్ సింగ్ సస్పెన్షన్‌ను ఎత్తేసేంత వరకూ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామంటూ ప్రతిపక్ష సభ్యులు తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా వారు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.

మణిపూర్ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లభించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు మరో అడుగు ముందుకేశారు. అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఇదివరకే వార్తలొచ్చాయి. ఈ నెలాఖరున దీన్ని సభలో ప్రవేశపెడతారని భావించారు.

Manipur

దీనికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీలు దూకుడును ప్రదర్శిస్తోన్నాయి. బుధవారమే అవిశ్వాస తీర్మానాన్ని సభలో టేబుల్ చేయనున్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కింద ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

2003లో అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్షాలు అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ అవిశ్వాసం తెలిపే అవకాశం రాలేదు. 2003 తరువాత అంటే 20 సంవత్సరాల తరువాత మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+