వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్య మధ్యతరగతి జీవితాలకు లాక్ డౌన్ గండం .. ప్రభుత్వాలతో పాటు, ప్రజలకు పెరుగుతున్న టెన్షన్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ భారత్ పైన కూడా పంజా విసిరింది. ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలు లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేకా లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? అన్న అంశంపై క్లారిటీ రాక ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా ప్రబలుతుందేమో అన్న భయం ఒక వైపు , లాక్ డౌన్ కొనసాగిస్తే ఇంకా ఆర్ధికంగా చితికిపోతామన్న భయం వెరసి లాక్ డౌన్ విషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా సందిగ్ధానికి లోనవుతున్నారు.

ఎస్ఈసిగా రమేష్ కుమార్ తొలగింపు .. ప్రజా స్వామ్యం ఖూనీ అని ప్రతిపక్షాల విమర్శలుఎస్ఈసిగా రమేష్ కుమార్ తొలగింపు .. ప్రజా స్వామ్యం ఖూనీ అని ప్రతిపక్షాల విమర్శలు

 లాక్ డౌన్ తో నరకం చూస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు

లాక్ డౌన్ తో నరకం చూస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు

కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపధ్యంలో ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర సర్కార్ ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేదని చెప్పటంతో వర్తక వాణిజ్యాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే పనులు లేక నరకం చూస్తున్నారు . ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తే ఆర్ధిక ఇబ్బందులు తప్పవని, తినటానికి కూడా తిండి దొరకని పరిస్థితులు ఏర్పడతాయని బాధ పడుతున్నారు.

లాక్ డౌన్ పొడిగిస్తే దారుణమైన ఆర్ధిక సంక్షోభం వస్తుందని భయం

లాక్ డౌన్ పొడిగిస్తే దారుణమైన ఆర్ధిక సంక్షోభం వస్తుందని భయం

ఇక ప్రభుత్వాల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. ఇప్పటికే కరోనా కంట్రోల్ కోసం పెద్దఎత్తున ఖర్చుపెడుతున్న కేంద్ర సర్కార్ నిధుల కోసం ఇబ్బంది పడుతుంది .
ఇక మరోపక్క రాష్ట్రాల పరిస్థితి కూడా ఖజానాలు ఖాళీ అయ్యి కేంద్రం వద్ద ఆర్ధిక సాయం కోసం చెయ్యి చాస్తున్న పరిస్థితి . దేశంలో కరోనా కేసులు బాగా పెరిగితే పరిస్థితి అదుపులోకి రాకుంటే లాక్ డౌన్ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అదే జరిగితే తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొనే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావం అన్ని వర్గాల మీద పడనుంది. వర్తక వాణిజ్యాలు , పరిశ్రమలు అన్నిటి మీదా దీని ప్రభావం పడనుంది .

అన్ని రంగాల మీద లాక్ డౌన్ ప్రభావం

అన్ని రంగాల మీద లాక్ డౌన్ ప్రభావం

ఒక పక్క కొన్ని రాష్ట్రాలు ప్రభావం లేని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ పాక్షికంగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటే మరికొన్ని రాష్ట్రాలు ఆర్ధిక సంక్షోభం వచ్చినా తప్పదని , ప్రజల ప్రాణాలే ముఖ్యమని లాక్ డౌన్ కొనసాగింపు వైపే మొగ్గు చూపుతూ కేంద్రానికి సూచనలు చేస్తున్నాయి. ఇక దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒకటే ప్రశ్న లాక్ డౌన్ కొనసాగుతుందా ? అదే జరిగితే పరిస్థితి ఏంటి ? ఏం తినాలి? ఎలా బ్రతకాలి? ఏ అవసరం ఆగుతుంది? ఏది కట్టకుండా వెసులు బాటు దొరుకుతుంది? ప్రభుత్వం మారటోరియం విధిస్తూ తర్వాత చెల్లించమని చెప్పినా కరోనా ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ ఎఫెక్ట్ వ్యాపారాల మీద దారుణంగా పెరుగుతుంది. అన్ని రంగాల మీద లాక్ డౌన్ ప్రభావం దారుణంగా ఉంటుంది .

భవిష్యత్ పై భయంతో ప్రభుత్వాలు, ప్రజలు

భవిష్యత్ పై భయంతో ప్రభుత్వాలు, ప్రజలు

నిత్యావసరాలు మినహాయించి ప్రజలు ఎవరూ మరే ఇతర లగ్జరీలపై దృష్టి పెట్టలేరు. ఒక ఆరు నెలల పాటైనా తీవ్రమైన ప్రభావం ఉంటుంది అని వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు . ఇక ఆర్ధిక భారం పెరిగి అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేకుండా పోతుంది అని భయపడుతున్నారు.ఇటు ప్రభుత్వాలకు సైతం ఎవరూ ఊహించనంత ఆర్ధిక నష్టం జరుగుతుంది . అయినా ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని ప్రవర్తించాల్సిన పరిస్థితి తీవ్ర సంక్షోభంలోకి నెడుతుంది . ఇక నేడు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరి దృష్టి ఏం నిర్ణయం తీసుకుంటారు అన్న అంశంపైనే ఉంది.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby

English summary
Do people who are already struggling in a lock down they are in fear of lock down continue decision. Clarity arrives on the subject of trouble. On the one hand, governments and people of india are in a dilemma over the lockdown, fearing that the lockdown will continue and finanial crisis will continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X