వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేడియో జాకీ గంగ: సంస్కృతంలో ఎఫ్ఎం: వాటర్ ప్లస్ సిటీగా: స్పోర్ట్స్‌పై ఫోకస్: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ సాధించిన అద్భుత విజయాలను ప్రస్తావించడంతో ఆయన ప్రసంగం ఆరంభమైంది. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ సేవలను స్మరించుకున్నారు. ఆయన అందించిన స్ఫూర్తితోనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ స్ఫూర్తిదాయక విజయాలను సాధించిందని అన్నారు. క్రీడారంగం సత్తా చాటడానికి ధ్యాన్‌చంద్ చెక్కు చెదరని పునాదులు వేశారని చెప్పారు.

సెల్యూట్..భవీనా: మహిళా శక్తికి ప్రతీక: ప్రశంసల హోరు: ప్రధాని మోడీ, వైఎస్ షర్మిల సహా (ఫొటోలు..ట్వీట్లు)సెల్యూట్..భవీనా: మహిళా శక్తికి ప్రతీక: ప్రశంసల హోరు: ప్రధాని మోడీ, వైఎస్ షర్మిల సహా (ఫొటోలు..ట్వీట్లు)

పీవీ సింధుకి 'మెగా' సన్మానం: హాజరైన సినీ ప్రముఖులు (ఫోటోలు)పీవీ సింధుకి 'మెగా' సన్మానం: హాజరైన సినీ ప్రముఖులు (ఫోటోలు)

టోక్యో స్ఫూర్తి ఆగకూడదు..

టోక్యో స్ఫూర్తి ఆగకూడదు..

ఒలింపిక్స్‌లో సాధించిన విజయాలు ఇక్కడితో ఆగకూడదని ప్రధాని అన్నారు. ఈ వేగాన్ని కొనసాగించాలని తాను అకాంక్షిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి నగరాల వరకూ ప్రతి ఒక్కరూ క్రీడల గురించి ఆలోచించేలా దేశ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో విజయాలను సాధించారని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి క్రీడా మైదానం కూడా ఆటగాళ్లతో కళకళలాడాల్సిన దశకు భారత్ చేరుకుందని అన్నారు. ఒక్క క్రీడకే పరిమితం కాకుండా.. అన్నిరకాల స్పోర్ట్ యాక్టివిటీస్ స్వేచ్ఛగా కొనసాగాల్సి ఉందని చెప్పారు.

పోటీతత్వంతోనే సమున్నత విజయాలు..

పోటీతత్వంతోనే సమున్నత విజయాలు..

పోటీ తత్వంతోనే ప్రతి ఒక్కరు సమున్న విజయాలను అందుకోగలుగుతారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. క్రీడలతో పాటు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. అరుదైన సెక్టార్లలో యువత వినూత్న రీతిలో విజయాలను అదుకోవడానికి తపన పడుతోందని, ఇది దేశ పురోగతికి, ఆత్మ నిర్భర్ భారత్‌కు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ కితాబిచ్చారు. కృష్ణాష్ఠమి పర్వదినాన్ని పురస్కరించుకుని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మందిరం అభిివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

ఇండోర్ వాటర్ ప్లస్ సిటీగా

ఇండోర్ వాటర్ ప్లస్ సిటీగా

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ వాటర్ ప్లస్ సిటీగా ఆవిర్భవించిందని ప్రధాని చెప్పారు. అత్యాధునిక పద్ధతులను ఇండోర్ వాసులు అనుసరిస్తోన్నారని, పర్యావరణాన్ని సంరక్షించుకుంటోన్నారని ప్రశంసించారు. సంప్రదాయేతర ఇంధన వనరులతో అక్కడి ప్రజలు అద్భుతాలను సృష్టిస్తోన్నారని చెప్పారు. ప్రత్యేకించి- నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా ఇండోర్.. వాటర్ ప్లస్ సిటీగా ఆవిర్భవించిందని మోడీ అన్నారు. సుదీర్ఘకాలం నుంచి ఇండోర్ నగర్ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానంలో నిలుస్తోందని గుర్తు చేశారు.

సంస్కృతంలో రేడియో ఎఫ్ఎం

సంస్కృతంలో రేడియో ఎఫ్ఎం

గుజరాత్‌లోని కెవాడియాలో కొందరు యువతీ యువకులు కలిసి కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియోను నడిపిస్తోన్న విషయాన్ని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రేడియో జాకీ గంగా సహా పలువురు యువకులు సంస్కృతంలో తమ కార్యక్రమాలను వినిపిస్తోన్నారని మోడీ చెప్పారు. సోమ్‌నాథ్‌లో శ్రీకృష్ణ భగవానుడి సేవలో ఉంటోన్న అమెరికన్ మహిళతో మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. భారత సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవిగా అభివర్ణించారు. తాను కొన్నేళ్ల నుంచీ ఇక్కడి సంప్రదాయాలను పాటిస్తున్నానని చెప్పారు.

విశ్వకర్మ జయంతి సందర్భంగా..

విశ్వకర్మ జయంతి సందర్భంగా..

విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్ దగ్గరి నుంచి శాటిలైట్ల వరకు ప్రతి ఒక్కరూ తమతమ రంగాల్లో విశ్వకర్మలేనని మోడీ పేర్కొన్నారు. చేతివృత్తులపై ఆధారపడిన ప్రతి ఒక్కరి ద్వారానే సమాజం అభివృద్ది చెందుతుందని చెప్పారు. మన చుట్టూ చాలామంది చేతివృత్తిదారులు కనిపిస్తుంటారని, వారందరూ దేశ ప్రగతి కోసం శ్రమించే వారేనని అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం అనేక చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం స్కిల్ డెవలప్‌మెంట్ మీదే ఆదారపడి ఉందని మోడీ పేర్కొన్నారు. దేశంలో నైపుణ్యానికి కొరత లేదని, దాన్ని మరింత సాన పెట్టాల్సి ఉందని అన్నారు.

English summary
Our sports grounds in villages, towns, cities must be full. Only through the participation of all, India can attain the height in sports it deserves: PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X