లోక్ సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..! అక్కడ లక్షన్నర ఫేక్ ఓట్లు..! రాహుల్ మరో షాక్..!
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. గతేడాది లోక్ సభ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ పై కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతేడాది లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ కు గురయ్యాయని, ఇక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండలేదని రాహుల్ గాంధీ తేల్చిచెప్పేసారు. లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, 2024 ఎన్నికల్లో అదే జరిగిందని రాహుల్ ఆరోపించారు. తమ వద్ద దీనికి బలం చేకూర్చే డేటా కూడా ఉందని తెలిపారు. తాము దీన్ని నిరూపించబోతున్నామని రాహుల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఎంపీ సీట్లో జరిగిన వివరాలను శాంపిల్ గా బయటపెట్టారు. అయితే ఆ నియోజకవర్గం పేరు చెప్పలేదు.

తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఓ లోక్ సభ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లు ఉంటే అందులో 1.5 లక్షల ఓట్లు నకిలీవే అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు తాము ఓటరు లిస్ట్ ను పరిశీలించినట్లు రాహుల్ బయటపెట్టారు. ఈ మోసంపైనే అధికార బిజెపి మెజారిటీ ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. బీజేపీకి మరో 15-20 సీట్లు తక్కువగా వచ్చి ఉంటే మోడీ ప్రధాని మోడీ అయ్యేవారు కాదన్నారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ ఆగస్టు 5న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ శాంపిల్ గా ఓ నియోజకవర్గంలో నకిలీ ఓట్లపై హింట్ ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికే తమపై చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోవద్దంటూ ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి ఈసీని టార్గెట్ చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications