Coronavirus:వామ్మో.. దేశ సగటు కంటే ఆ రాష్ట్రాల యావరేజ్ ఎక్కువ, అక్కడ వైరస్ వేగంగా వ్యాప్తి..
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ నెలరోజులు గడిచింది. దీంతో దేశంలో వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ఐఐటీ పరిశోధకులు రిసెర్చ్ చేశారు. వారి పరిశోధనలో కీలక అంశాలు వెలుగుచూశాయి. అయితే ఏడు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
ఆ రాష్ట్రాల్లో మూడింట రెండువంతుల వైరస్ కేసులు నమోదయ్యాయని గుర్తించారు. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ అనూప్ కృష్ణన్ నేతృత్వంలో ప్రొఫెసర్ హరిప్రసాద్ సహకారంతో ఐఐటీ విద్యార్థులు పరిశోధన చేశారు. జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని గుర్తించారు.

ఈ బృందం ప్రకృతి పేరుతో పోర్టల్ క్రియేట్ చేశారు. 19 రాష్ట్రాల్లో 100 జిల్లాల్లో వైరస్ 60 శాతం కన్నా ఎక్కుగా ఉందిఅని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి గుజరాత్‌లో ఎక్కువ అని.. వైరస్ సోకిన ప్రతీ ఒక్కరు 3.3 వ్యక్తులకు అంటించారని పేర్కొన్నది. 100 జిల్లాల్లో 28 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి 1.8గా ఉన్నదని తెలిపింది. ఇందులో రాజస్థాన్ 5, యూపీ 4, మధ్యప్రదేశ్ 4, గుజరాత్ 4, తమిళనాడు 3, మహారాష్ట్ర 3, కర్ణాటక 2, తెలంగాణ 2, పంజాబ్ ఒక జిల్లా ఉన్నాయి.
కేరళ, హర్యానా, తమిళనాడులో వైరస్ వ్యాప్తి రేటు ఒకటి కంటే తక్కువగా ఉంది అని పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పాయింట్ 93గా ఉంది. కానీ ఆరు జిల్లాల్లో మాత్రం ఎక్కువగా ఉంది అని గుర్తుచేసింది. తమిళనాడులోని తెనకాశీలో 6.27 ఉండగా, వెల్లూరులో 1.64 ఉంది పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మిగతా చోట్ల వైరస్ క్రమంగా తగ్గుతోన్న..ఆయా చోట్ల మాత్రం తగ్గడం లేదు.












Click it and Unblock the Notifications