పార్లమెంట్‌పై కరోనా ఎఫెక్ట్: 25 మంది ఎంపీలకు పాజిటివ్ - తొలిరోజు లోక్‌సభకు 359మందే

కరోనా విలయం ఎఫెక్ట్ పార్లమెంట్ పైనా బలంగానే పడింది. ఆర్థిక వ్యవస్థ పతనం, కొవిడ్ పెరుగుదల, సరిహద్దు వివాదాల వంటి కీలక చర్చలు జరుగనున్న వర్షాకాల సమావేశాలకు కనీసం 25 మంది ఎంపీలు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. సభ ప్రారంభానికి ముందు నిర్వహించిన టెస్టుల్లో 25 మంది ఎంపీలు కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. వీళ్లలో చాలా మందిని 14 రోజుల ఐసోలేషన్ లో ఉండాలంటూ డాక్టర్లు సూచించారు. అక్టోబర్ 1తో సమావేశాలు ముగియనున్నందున సదరు ఎంపీలు ఒక్కరోజైనా సభకు వచ్చేది అనుమానమే.

కరోనా కారణంగా తొలిరోజు సమావేశాలకు హాజరుకాలేకపోయిన 25 మంది ఎంపీల్లో 17 మంది లోక్ సభ సభ్యులు కాగా, మిగతా తొమ్మిది మంది రాజ్యసభ మెంబర్లు. లోక్ సభ సెక్రటేరియట్ వెల్లడించిన వివరాల ప్రకారం పాజిటివ్ గా తేలిసిన ఎంపీల్లో బీజేపీకి చెందిన 12 మంది సభ్యులు, వైసీపీకి చెందిన ఇద్దరు, శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ నుంచి ఒక్కో ఎంపీ ఉన్నారు.

Over 25 MPs from Both Houses Test Positive for Coronavirus on Day 1 of Parliament Session

కరోనా పాజిటివ్ గా తేలిన బీజేపీ సభ్యుల్లో లదాక్ యువ ఎంపీ జామ్ యాంగ్ సెరింగ్ నాంగ్యాల్, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, జనార్దన్ సింగ్ సిగ్రివాల్, సుకాంత మజుందార్, సుఖ్బీర్ సింగ్, బిద్యుత్ బరాన్ మహతో, ప్రదాన్ బరౌచ్, పర్వేజ్ సాహిబ్ వర్మ, సత్యపాల్ సింగ్ తదితరులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ ఎంపీలు మాధవి, రెడ్డప్పలు కరోనా పాజిటివ్ గా తేలారు. రాబోయే రెండు వారాల్లో ఇంకా ఎంత మంది వైరస్ కారణంగా సభకు దూరమయ్యే పరిస్థితి వస్తుందో చూడాలి.

వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం లోక్ సభకు హాజరైన ఎంపీల సంఖ్య 359గా ఉన్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ తెలిపింది. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ చరిత్రలో తొలిసారి ఎంపీల హాజరును ''అటెండెన్స్ రిజిస్టర్'' యాప్ ద్వారా చేపట్టారు. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేయడంతో, గ్యాలరీల్లోనూ ఎంపీలు కూర్చోవాల్సి వచ్చింది. డిస్టెన్స్ నిబంధనల ప్రకారం ఎంపీలకు మూడు వైపులా అద్దాలను ఏర్పాటు చేశారు. సభలో అందరూ తమ తమ సీట్లలో కూర్చొని మాత్రమే మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+