రాజ్ భవన్‌ను లేడీస్ క్లబ్‌గా మార్చేశారు, గవర్నర్ రాసలీలలంటూ లేఖ
మేఘాలయ రాజ్ భవన్‌లోని దాదాపు 80 మంది ఉద్యోగులు.. గవర్నర్‌ను తొలగించాలని, ఆయనను భారత్ నుంచి బయటకు పంపించివేయాలని కోరుతున్నారు.
షిల్లాంగ్: మేఘాలయ రాజ్ భవన్‌లోని దాదాపు 80 మంది ఉద్యోగులు.. గవర్నర్‌ను తొలగించాలని, ఆయనను భారత్ నుంచి బయటకు పంపించివేయాలని కోరుతున్నారు. రాజ్ భవన్ లేడీస్ క్లబ్‌గా మారిందని ఆరోపిస్తున్నారు.
మేఘాలయ గవర్నర్‌గా వి షణ్ముగనాథన్ ఉన్నారు. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఉద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు లేఖలు రాశారు. అయిదు పేజీల ఆ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు.
గవర్నర్ చేస్తున్న పనుల వల్లరాజ్ భవన్ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు రాజ్‌భవన్ ఉద్యోగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాజ్ భవన్‌లో ఉన్నామన్న సభ్యత కూడా మరిచి ప్రవర్తిస్తూ.. దీనిని క్లబ్‌గా మార్చేశారని ఆరోపించారు. దీంతో ఇక్కడి సిబ్బంది మనోవేదనకు గురి కావాల్సి వస్తోందన్నారు.
కాగా, స్వయానా ఆయన ఆదేశాల మేరకే కొందరు యువతులు ఇష్టారాజ్యంగా లోపలికి వచ్చి బయటికి పోతున్నారని, ఈ విషయంలో గవర్నర్ నివాసానికి ఉండే భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపించారు.

2015 మేలో ఆయనను కేంద్రం మేఘాలయ గవర్నర్‌గా నియమించింది. గతేడాది సెప్టెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్‌ఖోవాను పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ రాష్ట్ర బాధ్యతలను కూడా షణ్ముగనాథన్‌కే అప్పగించింది. ఈ లోగా ఒకేడాది పాటు ఆయన మణిపూర్ ఇంచార్జి గవర్నర్‌గా కూడా పని చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో ఉన్న షణ్ముగనాథన్ తనపై సిబ్బంది చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం అంటూ కొట్టిపారేశారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారిని ఎంపిక చేసే ముందు మాత్రమే తాను వారిని కలుసుకున్నానని, కాబట్టే వారంతా వచ్చారని, వచ్చిన వాళ్లంతా రాజ్‌భవన్‌లో అరగంట పాటు మాత్రమే ఉన్నారని, తనకు వారందరి మీద అపార గౌరవం ఉందని, తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు.
ఇదిలా ఉండగా, గత డిసెంబర్‌లో రాజ్‌భవన్ పీఆర్వో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన ఓ మహిళ... తనను గవర్నర్ 'కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నారు' అని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఓ పత్రిక కథనం ప్రచురించడంతో వివాదం రేగింది.












Click it and Unblock the Notifications