బాత్ రూం టైల్స్ కింద వజ్రాలు: రూ. 24కోట్లు
కోల్ కతా: ప్రభుత్వ ఇంజనీరు ఇంటిలో బయటపడిన నోట్ల కట్టలు చూసిన ఏసీబీ అధికారుల కళ్లు తిరిగిపోయాయి. బాత్ రూంలోని టైల్స్ కింద కోట్ల రూపాయలను బయటకు తీశారు. వజ్రాలు, బంగారు నగలు బయటపడ్డాయి.
పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాలోని బాలీలో ఇంజనీర్ ప్రణబ్ అనే ఆయనను, ఆయన కుమారుడిని అరెస్టు చేశామని సోమవారం పోలీసు అధికారులు చెప్పారు. బాలీ మునిసిపాలిటిలో ప్రణబ్ అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు.
ఇతను లంచం ఇవ్వాలని పదేపదే వేధించడంతో బాలీలోని ఒక బిల్డర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు ప్రణబ్ ఇంటిపై దాడి చేశారు. ఆరు గదులలో టైల్స్ కింద దాచి పెట్టిన రూ. 1,000, రూ.500, రూ.100 నోట్ల కట్టలను బయటకు తీశారు.

అంతే కాకుండా బాత్ రూంలో టైల్స్ కింద దాచి పెట్టిన రూ. 1,000 నోట్ల కట్టలు, బంగారు, వజ్రాల నగలు బయటకు తీశారు. మొత్తం రూ. 24 కోట్లు నగదు లెక్కపెట్టారు. బంగారు, వజ్రాల నగల విలువ లెక్కవేస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు.
అంతే కాకూండ వివిధ బ్యాంకుల అకౌంట్ ల పాస్ బుక్ లు స్వాధీనం చేసుకున్నారు. రూ. ఒక కోటి వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ ల కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల ఉన్న ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ప్రణబ్ కు నెలకు రూ. 45,000 జీతం వస్తుందని, 25 సంవత్సరాలుగా పని చేస్తున్నాడని, అయితే ఇంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడని ఏసీబీ అధికారులు చెప్పారు. ఇంజనీరు ప్రణబ్ తో పాటు ఆయన కుమారుడిని అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications