వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

99 శాతం ఇమ్యూనిటీ: 60 ఆపై వృద్దులకు కూడా.. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తాజా అధ్యయనం..

|
Google Oneindia TeluguNews

ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గురించి పరిశోధనలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. 60 ఆపై వయస్సు గల వారిలో రోగనిరోధక శక్తి బలంగా చూపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని బుధవారం విడుదల చేశారు. వీరిలో 99 శాతం ఇమ్యూనిటీ వచ్చిందని తెలిపారు.

Recommended Video

Covid-19 Vaccine : AstraZeneca Vaccine తాజా అధ్యయనం.. వృద్దుల్లో పెరుగుతున్న రోగ నిరోధక శక్తి!
70 ఏళ్ల వయస్సు వారికి..

70 ఏళ్ల వయస్సు వారికి..

వ్యాక్సిన్ కోసం మే 30వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు నమోదు చేసుకున్న వాలంటీర్లను పరిశీలిస్తున్నారు. 560 మంది అన్నీ వయస్సుల వారు ఉన్నారు. అయితే జూలైలో మాత్రం 55 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ చక్కగా పనిచేస్తుందని తెలిపారు. ఇదీ తాజాగా మాత్రం వృద్దుల్లో కూడా రోగ నిరోధక శక్తి పెంచుతుందని వివరించారు. ఈ మేరకు లాన్సెట్ మెడికల్ జర్నల్ లో 70 ఏళ్ల వయస్సు గల వారు కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందని పేర్కొన్నారు.

మరో వ్యాక్సిన్ కూడా..

మరో వ్యాక్సిన్ కూడా..

దీంతోపాటు ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ సురక్షితం అని పరిశోధనలో తేలిందన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా మంచి ప్రభావం చూపిస్తోన్నాయి. రెండో దశ ప్రయోగం జరుగుతుందని.. మూడో దశ ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించారు. మరికొద్దిరోజుల్లో మూడో దశ ఫలితాలు కూడా బయటకు వస్తాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది. క్రిస్మస్ కన్నా ముందే అస్ట్రాజెనుకా వ్యాక్సిన్ ఫలితాలు వస్తాయని వ్యాక్సిన్ డైరెక్టర్ ఆండ్రూ పొలార్డ్ తెలియజేశారు.

 థర్డ్ ఫేజ్.. ముందుడుగు

థర్డ్ ఫేజ్.. ముందుడుగు

వ్యాక్సిన్ కు సంబంధించి ఫైజర్, మోడెర్నా ముందు దశలో ఉండగా.. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కాస్త వెనుకంజలో ఉంది. గత వారం రోజుల నుంచి తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే ఈ రెండు టీకాలు ఖరీదైనవి కావడం విశేషం. అస్ట్రాజెనెకాకు సంబంధించి మాత్రం.. ధరను వెల్లడించలేదు.

English summary
Oxford University and AstraZeneca Plc's Covid-19 vaccine shot has produced “robust immune response” in elderly candidates above 60 years of age and is safe, according to a new study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X