పద్మ అవార్డు గ్రహీత..పేరుకు స్వామీజీ..12 సార్లు అత్యాచారం చేసిన కామాంధుడు..?
సమాజంలో నానాటికీ నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. మహిళ కనిపిస్తే కాటేసేందుకు కామాంధులు కాచుకు కూర్చున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా తెగబడుతున్నారు. ఒక హోదాలో ఉన్న వాళ్లే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. స్వామీజీ ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా... అత్యాచారాలు సైతం చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. పైగా సమాజంలో పెద్ద మనుషుల్లా చలామణి కావడం అంతకన్నా దారుణం. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2013లో ఒక పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కార్తీక్ మహారాజ్ సన్నిహితుడని చెబుతున్నారు. అయితే, ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.

అసలు ఏం జరిగింది..?
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, కార్తీక్ మహారాజ్ భారత్ సేవాశ్రమ్ సంఘానికి చెందిన సన్యాసి. బాధితురాలికి ముర్షిదాబాద్‌లోని ఆశ్రమంలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. ఆ ఆశ్రమంలోనే ఉన్న పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఆశ్రమంలోనే వసతి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఒకరోజు రాత్రి కార్తీక్ మహారాజ్ తన గదిలోకి ప్రవేశించి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. 2013 జనవరి నుండి జూన్ మధ్య ఆరు నెలల కాలంలో కనీసం 12 సార్లు అత్యాచారం చేశారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. భయం, నిస్సహాయత కారణంగా ఇన్నేళ్లూ ఈ విషయంపై మౌనంగా ఉన్నానని ఆమె తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని మహారాజ్ బెదిరించారని కూడా బాధితురాలు పేర్కొన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటనపై ఫిర్యాదు నమోదైంది. కార్తీక్ మహారాజ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కార్తీక్ మహారాజ్ ఆరోపణలను ఖండించారు
ఈ ఏడాది దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అందుకున్న కార్తీక్ మహారాజ్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆశ్రమంలో వసతి సౌకర్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను సన్యాసినని ఇలాంటి ఆటంకాలు సన్యాసి జీవితంలో సాధారణమని ఆయన చిన్నపాటి కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై తన న్యాయవాదులు కోర్టులో స్పందిస్తారని ఆయన తెలిపారు.
ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కార్తీక్ మహారాజ్‌కు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం కార్తీక్ మహారాజ్ ఎన్నికలలో బీజేపీకి సహాయం చేస్తున్నారని, తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తన ఆశ్రమం యొక్క ప్రతిష్టను దిగజార్చినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ 2024లో బెనర్జీకి మహారాజ్ లీగల్ నోటీసు పంపారు.
ఇటీవల ఒక న్యాయ విద్యార్థిని కోల్‌కతాలోని కళాశాల ఆవరణలో తనపై ఒక పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించిన ఘటనతో అధికార తృణమూల్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సంఘటన వెలుగులోకి రావడం గమనార్హం. భారతదేశంలో మహిళల భద్రత, లైంగిక వేధింపులకు సంబంధించిన సమస్యలపై ఈ కేసు మరోసారి దృష్టిని సారించింది. బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలని ప్రజలు కోరుతున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications