ఇది నాకు లభించిన అత్యున్నత గౌరవం..పద్మభూషణ్ అవార్డుపై మోహన్ లాల్... రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల
న్యూఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. గ్రహీతలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులను అందజేశారు. పద్మ శ్రీ సహా వివిధ విభాగాల్లో 112 మంది విజేతల్లో సోమవారం 56 మందికి సోమవారం అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. మిగిలినవారికి ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు.

విరబూసిన పద్మాలు ..
పద్మభూషణ్ విభాగంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ , సర్దార్ సుఖ్‌దేవ్ సింగ్ దిల్సా, హకుందేవ్ నారాయణ్ యాదవ్ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ చేతులమీదుగా అవార్డు స్పీకరించారు. ప్రముఖ జర్నలిస్ట్ కుల్ దీప్ నయ్యర్ మరణానతంరం ఆయన భార్య భారతి నయ్యర్ అవార్డు స్పీకరించారు. రెజర్ల్ భజరంగ్ పునియా, చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్, నటుడు ప్రభుదేవా, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, కబడ్డీ ఆటగాడు అజయ్ ఠాకూర్ తదితరులు పద్మ పురస్కారాలు స్వీకరించారు.

ఇదో గొప్ప విజయం ...
పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన మోహన్ లాల్ ఉద్వేగానికి గురయ్యారు. 'ఇది నాకు లభించిన గౌరవం, వ్యక్తిగత జీవితంలో ఇదోక గొప్ప విజయం .. 41 ఏళ్ల సినీ జీవితంలో తనకు దక్కిన ఈ గుర్తింపుకు సహచరులు, కుటుంబసభ్యుల సహకారంతో ఈ పయనం సాఫీగా సాగిందని‘ అన్నారు.

తనంటే ఇష్టపడేవారికి అంకితం ..
పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా స్వీకరించిన తర్వాత ప్రభుదేవా ఆనందానికి అవధి లేకుండా పోయింది. 'నా మీద ప్రేమ చూపిన మీ అందరికీ ధన్యావాదాలు, మీ ప్రేమతోనే పద్మ శ్రీ అవార్డు ఇచ్చేందుకు దోహదపడింది. ఈ అవార్డు తనను ప్రేమించిన వారికీ అంకితం చేస్తున్నాను‘ అని అన్నారు.












Click it and Unblock the Notifications