పెయిడ్ కార్యకర్తలకు డిమాండ్, మార్నింగ్ టూ నైట్, లీడర్స్ కు బొక్క !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా చివరి రోజు అయిన సోమవారం ఎన్నికల ప్రచారం చెయ్యడానికి, పార్టీ జెండాలు మొయ్యడానికి కొందరు భలే డిమాండ్లు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలా మంది ఇప్పటికే దిక్కులేనంత డబ్బులు మందు బాటిళ్లకు, బిర్యానీ ప్యాకెట్లకు పెట్టారని వెలుగు చూసింది.

ఎండ ఉంది, వానలు పడుతున్నాయి అంటూ డిమాండ్లు చేసిన కొందరు లగ్జరీలైఫ్ గడిపేశారని సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి జులాయిగా తిరిగేవారికి చేతినిండా డబ్బలు చిక్కాయి. కష్టపడకుండా ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం మత్తులో ఉంటున్న వారిని డిమాండ్ ఎక్కువగానే వచ్చింది.

 Karnataka Assembly Elections

ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకున్న కొందరు నాయకులు ఎన్నికల ప్రచారం చేసే సమయంలో వారి వెంట ఎక్కువ మంది ప్రజలు ఉండేలా చూసుకుంటూ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు. జనం ఎంత ఎక్కువగా ఉంటే ప్రజలు తమ గురించి అంత మంచిగా ఆలోచిస్తారని, లేదంటే ఓట్లు వెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించరని నాయకులు భయపడుతున్నారు.

ఇదే సందర్బంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి నాయకుల వెంట వెళ్లిన చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు లగ్జరీలైఫ్ గడిపారని వెలుగు చూసింది. ఏ నాయకుడికి అయితే ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వెలుతున్నారో ఆ నాయకుడి పేరుతో పాటు ఆ పార్టీకి ఉదయం నుంచి రాత్రి వరకు జిందాబాద్ లు చెప్పారు.

ఉదయం ఎన్నికల ప్రచారం మొదలు కాకముందే టిఫిన్లు, మద్యాహ్నం క్వాటర్ ముందు లేదంటే బీర్ బాటిల్స్, బిర్యానీలు ఇవ్వాలని, రాత్రి మళ్లీ క్వాటర్ మందు, బిర్యానీతో పాటు రూ. 2 వేలు డబ్బులు ఇవ్వాలని కొందరు రాజకీయ పార్టీల నాయకుల దగ్గర డిమాండ్ చేశారని, మాకు ఏదైనా తక్కువ అయితే మీ వెంట ఎన్నికల ప్రచారానికి రామని తేల్చి చెప్పారని తెలిసింది.

ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వెళ్లే సమయంలో జనం తక్కువగా ఉంటే పరువు పోతుందని, ప్రజలకు మనమీద నమ్మకంపోతుందని అనుకున్న కొందరు నాయకులు ఎన్నిక ప్రచారం చెయ్యడానికి వచ్చిన వాళ్లు ఏమి అడిగినా ఇచ్చారని సమాచారం. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో సోమవారం ఇలాంటి మందు బాబులకు ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది.

 Karnataka Assembly Elections

బెంగళూరులో పలు ప్రాంతాల్లో మద్యాహ్నం నుంచి వానలు పడుతుండటంతో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ఇబ్బందిగా మారింది. ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చాలా మందికి రాత్రి సెటిల్ మెంట్లు చేస్తున్న కొందరు లీడర్లు ఎన్నికలకు ఎంత ఖర్చు అయ్యింది అని లెక్కలు వేసుకున్నారని తెలిసింది. సోమవారం సాయంత్రంతో బహిరంగంగా ఎన్నికల ప్రచారానికి తెరపడతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా అద్దె కార్యకర్తలకు డిమాండ్ చాలా పెరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+