వ్యాపార దిగ్గజాలకు చుక్కలు చూపిన పతంజలికి భారీ, తగ్గిన ఆదాయం

న్యూఢిల్లీ: పతంజలి ఉత్పత్తులకు షాక్. గత అయిదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, కార్పోరేట్ వ్యాపార సంస్థలకు ధీటుగా సేల్స్ సాధించి, ఎన్నో వ్యాపార సంస్థలకు చుక్కలు చూపించిన పతంజలి ఉత్పత్తులు గత అయిదేళ్లలో ఎన్నడు లేని విధంగా పడిపోయాయి.

స్వదేశీ వస్తువులే వాడుదాం అన్న నినాదంతో పతంజలి ఉత్పత్తులు వచ్చాయి. దీనికి యోగా గురువు రాందేవ్ బాబా ప్రచారకర్తగా ఉన్నారు. పతంజలి నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులు వచ్చాయి. ప్రత్యేక స్టోర్‌లు వెలిశాయి. ఎన్నో వ్యాపార దిగ్గజాలు పందజలి కారణంగా ఉక్కిరిబిక్కిరి అయ్యాయి.

Pain in Patanjali chain: Sales drop first time in five years

అయితే, గత కొంతకాలంగా పతంజలి ఉత్పత్తులకు ఆదరణ కొంచెం తగ్గిందట. అయిదేళ్లలో తొలిసారి పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవలపన్ను(జీఎస్టీ), సంస్థకు సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వల్ల అమ్మకాల జోరు తగ్గిందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక వెల్లడించింది.

మార్చి 2018 నాటికి స్టాండ్‌లోన్‌ పద్ధతిలో వినియోగ వస్తువుల ద్వారా ఆదాయం పది శాతం తగ్గి రూ.8,148 కోట్లకు పరిమితమైంది. 2013 తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి అని బ్లూమ్‌బెర్గ్‌ నివేదికలో పేర్కొంది. ప్రాథమిక క్షీణత నమోదైందని, సరైన సమయంలో జీఎస్టీని ఆకళింపు చేసుకోలేకపోవడం, సరైన అవస్థాపనా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+