జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...! సిధ్ధంగా ఉన్నామన్న నేవీ చీఫ్ (ఫోటోలు)

న్యూఢిల్లీ: పాకిస్ధాన్ యుద్ధ నౌకలను వాడుకొని భారత్‌పై దాడులు జరపాలని టెర్రరిస్టు గ్రూపులైన జీహాదీలు భావిస్తున్నారని, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు నౌకా దళం సిద్ధంగా ఉందని చీఫ్ అడ్మిరల్ రాబిన్ దోవన్ తెలిపారు.

డిసెంబర్ 4 నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గత సెప్టెంబర్ 6న పాకిస్తాన్ తేలికపాటి యుద్ధ నౌకలు పీఎన్ఎస్ అస్లత్, పీఎన్ఎస్ జుల్ఫీకర్ లను కరాచీ నుంచి దొంగిలించేందుకు అల్-ఖైదా ప్రయత్నించి విఫలమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ నౌకలను ఇండియా, యూఎస్ వార్ షిప్ లపై దాడులకు వినియోగించాలని ఉగ్రవాదులు భావించారని తెలిపారు.

భారత సముద్ర జలాల్లో పాకిస్ధాన్ నౌకలను అనుమానంగా చూడటం ఇప్పుడు సాధారణంగా మారిందని ఆయన చెప్పారు. మొత్తం 140 యుద్ధ నౌకలు భారత అమ్ముల పొదిలో ఉండగా, దాదాపు 75 నౌకలు హిందూ మహా సముద్రం ప్రాంతంలో మొహరించి నిఘా పెట్టాయని తెలిపారు.

మన చుట్టూ ఉన్న వివిధ దేశాల పోర్టులలో చైనా అడుగుపెడుతుందని, చైనా నేవీ చేస్తున్న కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నామని ఆయన వివరించారు. గత ఏడాది ఆగస్టులో ముంబై హర్బర్‌లో రష్యా సహాకారంతో తయారుచేసిన ఐఎన్‌ఎస్ సిధురక్షక్ సబ్‌మెరైన్‌‌లో జరిగిన ప్రమాదాన్ని మానవ తప్పిదమని అన్నారు.

ఈ ప్రమాదంలో ఐఎన్‌ఎస్ సిధురక్షక్ మునిగిపోయి 18 చనిపోయిన విషయం తెలిసిందే. సబ్ మెరైన్‌లో ఉన్న పేలుడు పదార్ధాలు, ఇంధనం, ఆక్సిజన్ సిలిండర్ల వల్ల ఈ పేలుళ్లు సంభవించాయని తెలిపారు.

 జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

పాకిస్ధాన్ యుద్ధ నౌకలను వాడుకొని భారత్‌పై దాడులు జరపాలని టెర్రరిస్టు గ్రూపులైన జీహాదీలు భావిస్తున్నారని, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు నౌకా దళం సిద్ధంగా ఉందని చీఫ్ అడ్మిరల్ రాబిన్ దోవన్ తెలిపారు.

 జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

డిసెంబర్ 4 నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గత సెప్టెంబర్ 6న పాకిస్తాన్ తేలికపాటి యుద్ధ నౌకలు పీఎన్ఎస్ అస్లత్, పీఎన్ఎస్ జుల్ఫీకర్ లను కరాచీ నుంచి దొంగిలించేందుకు అల్-ఖైదా ప్రయత్నించి విఫలమైందని చెప్పారు.

 జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

భారత సముద్ర జలాల్లో పాకిస్ధాన్ నౌకలను అనుమానంగా చూడటం ఇప్పుడు సాధారణంగా మారిందని ఆయన చెప్పారు. మొత్తం 140 యుద్ధ నౌకలు భారత అమ్ముల పొదిలో ఉండగా, దాదాపు 75 నౌకలు హిందూ మహా సముద్రం ప్రాంతంలో మొహరించి నిఘా పెట్టాయని తెలిపారు.

 జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

జీహాదీల చేతుల్లోకి పాకిస్ధాన్ యుద్ధ నౌకలు...!

ఈ ప్రమాదంలో ఐఎన్‌ఎస్ సిధురక్షక్ మునిగిపోయి 18 చనిపోయిన విషయం తెలిసిందే. సబ్ మెరైన్‌లో ఉన్న పేలుడు పదార్ధాలు, ఇంధనం, ఆక్సిజన్ సిలిండర్ల వల్ల ఈ పేలుళ్లు సంభవించాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+