తీరుమారని పాక్..మరోసారి నమ్మించి వెన్నుపోటు
సోమవారం సాయంత్రం జరిగిన డీజీఎంఓ స్థాయి చర్చల్లో కాల్పులు ఉండకూడదని, దూకుడు చర్యలకు స్వస్తి చెప్పాలని ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ, పాకిస్తాన్ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. సోమవారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని సాంబ, కథువా సెక్టార్లలో డ్రోన్ల ద్వారా దాడికి ప్రయత్నించడం వారి విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది.
భారత సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల పాక్ ప్రయత్నం విఫలమైంది. అయితే, ఈ ఘటన పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్‌కు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉండగా, కొన్ని గంటల ముందే ప్రధాని మోడీ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఊహించని పరిణామాలు ఉంటాయని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమని, న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.
ప్రధాని హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఈ చర్యకు పాల్పడటం వారి దురుద్దేశాన్ని తెలియజేస్తోంది. చర్చల సమయంలో ఒక మాట, చేతల్లో మరొక విధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ నీతిని బయటపెడుతోంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. పాకిస్తాన్ ఈ తరహా ప్రవర్తనను భారత్ ఎంతవరకు సహిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. శాంతియుత వాతావరణం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications