పాక్ కు ఈగో, ఆర్మీకి అహంకారం: అందుకే అలా ?
జమ్మూ: పాకిస్థాన్ అహంకారం తక్కువ చేసుకోవడం ఇష్టం లేకనే పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ స్ట్రైక్ దాడులు జరగలేదని చెబుతుందని బీజేపీ ఆరోపించింది. పాకిస్థాన్ ఆర్మీ, పాక్ లో ఏ ప్రభుత్వం ఉన్నా వారికి అహంకారం ఎక్కువే ఉంటుందని బీజేపీ చెప్పింది.
వారి అహంకారం సంతృప్తి చెందడానికి సర్జికల్ స్ట్రైక్ దాడులు జరగలేదని చెబుతుందని జమ్మూలో బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గుప్తా అన్నారు. పాకిస్థాన్ వ్యాఖ్యలను వీరేందర్ గుప్తా ఖండించారు.
పాకిస్థాన్ దేశ ఆర్మీ అధికారి దిగిపోతున్న సందర్బంలో సర్జికల్ స్ట్రైక్ దాడులు జరిగాయి అని అస్సలు అంగీకరించదని ఆయన చెప్పారు. భారత ఆర్మీని కాంగ్రెస్ పార్టీ నేతలు తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

భారత ఆర్మీ గురించి తక్కువ చేసి మాట్లాడే కాంగ్రెస్, కాశ్మీర్ నాయకులు దేశం విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరించారు. భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ దాడులను పాక్ అంగీకరించకపోవడం వెనుక వాస్తవం ఏమిటి అనే విషయం ఆయన ఇలా చెప్పారు.
పాకిస్థాన్ ప్రభుత్వానికి, పాక్ ఆర్మీ తమ అహంకారాన్ని ఎప్పూడూ తక్కువ కానివ్వవు అన్నారు. పాక్ ఆర్మీ అక్కడి ఉగ్రవాదులను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారని, పాక్ ప్రభుత్వానికి కంటే ఉగ్రవాదులకే వారు ఎక్కువ ప్రధాన్యత ఇస్తారని బీజేపీ అధికార ప్రతినిధి వీరందర్ గుప్తా ఆరోపించారు.












Click it and Unblock the Notifications