భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటోన్నాం: గోవాలో అడుగుపెట్టిన పాకిస్తాన్ మంత్రి భుట్టో

పనాజీ: ప్రతిష్ఠాత్మక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అత్యున్నత భేటీ.. గోవా వేదికగా కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఇది. ఎస్‌సీఓలో సభ్యత్వం ఉన్న దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత ఈ కీలక భేటీకి భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇటీవలే ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీ ముగిసింది. ఇక విదేశాంగ మంత్రులు సమావేశం అయ్యారు.

సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. భారత్ సహా చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియాల.. అబ్జర్వర్ స్టేట్స్‌ హోదాలో కొనసాగుతున్నాయి.

Bilawal Bhutto Zardari arrives in Goa for SCO meeting

ఆర్మేనియా, అజర్‌బైజాన్, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీలకు డైలాగ్ పార్ట్‌నర్‌షిప్ ఉంది ఇందులో. ఎస్సీఓలో పాకిస్తాన్‌కు సభ్యత్వం ఉన్నప్పటికీ- ఆ దేశ మంత్రి రక్షణ శాఖ మంత్రి ఈ భేటీకి హాజరు కాలేదు. ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఇందులో పాల్గొన్నారు. దీనికి భిన్నంగా పాకిస్తాన్ తాజా నిర్ణయం తీసుకుంది. విదేశాంగ మంత్రుల భేటీకి ప్రతినిధులను పంపించింది.

ఇవ్వాళ గోవాలో ఆరంభమైన ఎస్సీఓ సభ్య దేశాల సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి- హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని సంవత్సరాల విరామం తరువాత పాకిస్తాన్‌కు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి లేదా మంత్రి భారత్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ఫలితంగా అందరి చూపులూ బిలావల్ భుట్టో జర్దారి మీదే నిలిచాయి.

ఈ సమ్మిట్‌లో ఆయన ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధుల బృందానికి ఆయనే ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ భేటీలో పాల్గొనడానికి గల కారణాలను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వివరించారు. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఎస్సీఓ సభ్య దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోన్నామని, అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. ఎస్సీఓకు ఆతిథ్యాన్ని ఇస్తోన్న భారత్‌కు తమ ప్రతినిధులను పంపించడం ద్వారా- తమ చిత్తశుద్ధి, నిబద్ధతను చాటుకున్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఆసియన్ రీజియన్‌లో శాంతి, సుస్థిరత పరిస్థితులను తాము కాంక్షిస్తోన్నామని వివరించారు.

గోవా భేటీలో పాల్గొనడం ద్వారా భాగస్వామ్య ధర్మాన్ని తాము పాటించామని, ఆ విలువలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. వాటిని మరింత బలోపేతం చేసుకోవడంలో తమవంతు పాత్రను పోషించడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. సభ్య దేశాల మధ్య అన్ని రకాల కనెక్టివిటీ, వాణిజ్యం, పరస్పర సహకారం అవసరమని షెహబాజ్ షరీఫ్ తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+