వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయంతో కూడిన బెదిరింపులకు దిగుతున్న పాకిస్థాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామా దాడితో ఏర్పడిన ఉద్రిక్తత వైమానిక దాడులతో పీక్ స్టేజీకి చేరింది. దీనికి కొనసాగింపుగా బుధవారం భారత్, పాకిస్థాన్ జెట్ విమానాల కూల్చివేత సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అవరించాయి. ఎప్పుడు .. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంతకీ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత తగ్గుతోందా ? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ శక్తి, సామ్యర్థ్యాలు ఏంటనే చర్చ మొదలైంది. భారత్ సంధించే అస్త్రాల ముందు పాకిస్థాన్ నిలువగలదా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. భారత ఉపఖండంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.

లోన భయం ... పైకి గాంభీరం

లోన భయం ... పైకి గాంభీరం

ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్థాన్. ఉగ్ర మూకలకు శిక్షణ ఇస్తూ .. ప్రపంచం మీదికి వదులుతోంది. పైకి మాత్రం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చర్యలు చేపడుతామని కలరింగ్ ఇస్తోంది. ఐఏఎఫ్ ఫైటర్ల దాడులతో భారత్ సైనికుల శక్తి సామర్థ్యాలను చూసిన పాకిస్థాన్ జంకింది. మిరాజ్ యుద్ధ విమానాల ధాటికి తట్టుకోలేమని మిన్నకుండిపోయింది. బుధవారం ఎప్పటిలాగే కాల్పులు చేస్తూ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ పాకిస్థాన్ రైల్వేమంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యలు పైకి గాంభీరంగా మాట్లాడారు. వచ్చే 72 గంటలు తమకు కీలకమని .. అలర్ట్ గా ఉంటూ .. దాడులు చేస్తామని పరోక్ష సంకేతాలిచ్చారు. భారత్ సైనిక శక్తి సామర్థ్యం గురించి తెలిసిన ఆయన లోన భయం పెట్టుకొని .. పైకి మాత్రం అదేం లేదని బిల్డప్ ఇచ్చారు. దీంతోపాటు యుద్ధం అంటూ వస్తే రెండో ప్రపంచ యుద్ధంగా కంటే ఎక్కువ నష్టమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. యుద్ధం ఎవరూ కోరుకున్నారు ? కవ్వింపు చర్యలకు దిగింది ఎవరు ? పుల్వామాతో ఉద్రిక్తత పరిస్థితికి కారణం ఎవరనే విషయాన్ని మరచిపోయినట్టున్నారు.

నైతికత ఉందా ?

నైతికత ఉందా ?

పాకిస్థాన్ చెప్పేది ఒకటి, చేసేదీ మరొకటి అవుతోంది. గతంలో కూడా చాలాసార్లు పైకి ఒకటి చెప్పి .. కార్యాచరణ వేరేలా మార్చింది. ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంభిస్తోంది. బుధవారం మిగ్ 21 విమానం, ఫైలట్ మిస్సయ్యారని భారత విదేశాంగ ప్రకటించింది. అంతకుముందు భారత ఐఏఎఫ్ అధికారి పట్టుబడ్డారని చెప్పినా పాక్ .. భారత విదేశాంగ శాఖ ప్రకటన తర్వాత ఎలాంటి సమాచారం అందించలేదు. ఒకవేళ తమ ఆధీనంలో ఉంటే మీడియాకు చూపించాల్సి ఉండేది. కానీ పాపిస్థాన్ అలా కలలో కూడా చేయదు. ఇదివరకు గతంలో దొరికిన భరతమాత ముద్దుబిడ్డలను పాశవికంగా నరికి పైశాచిక ఆనందం పొందింది. తన వైఖరిలో ఏ మాత్రం మార్పులేని పాకిస్థాన్ నీతులు ఎందుకు వల్లెవేస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

శాంతి చర్చల వెనుక ..

శాంతి చర్చల వెనుక ..

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్తగా శాంతి మంత్రం జపించారు. నిన్న, మొన్నటి వరకు యుద్ధం వస్తే చూస్తూ ఊరుకోమని చెప్పిన ఆయన వైఖరి సడెన్ గా ఎందుకు మారిందో అర్థం కావడం లేదు. సరిహద్దులో ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇమ్రాన్ నిజంగా యత్నిస్తున్నారా ? మరి ఇన్నాళ్లు ఆయన ఎందుకు శాంతి కోసం పాటుపడలేదు అనే సందేహాలు వస్తున్నాయి. కొత్తగా పుల్వామా దాడి చేసిన నిందితులను పట్టుకునేందుకు అన్నివిధలా సహకరిస్తామనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంటే పాక్ లో నక్కిన జైషే మహ్మద్ శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేస్తే తప్పా ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్థాన్ ప్రధాన మంత్రి వైఖరిలో మార్పు రాదా అని మేధావులు నిలదీస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిమని .. మాటలు చెప్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భారత్ సామర్థ్యం ముందు పాక్ నిలబడగలదా ?

భారత్ సామర్థ్యం ముందు పాక్ నిలబడగలదా ?

ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పరిస్థితి ఏంటీ. రక్షణ రంగంలో భారత్, పాకిస్థాన్ బలబలాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిద్దాం. అసేతు భారత సైన్యం అక్షరాల 14 లక్షల మంది. కానీ పాకిస్థాన్ మాత్రం 6 లక్షల 53 వేల 800 మంది ఉన్నారు. అంటే మనలో సగం కూడా జవాన్లు వారికి లేరు. అగ్ని అలాంటి కీలక క్షిపణులు భారత అమ్ముల పొదిలో పొదిగి ఉన్నాయి. అగ్ని మూడు క్షిపణులతో కలిపి మొత్తం 9 రకాల క్షిపణులు భారత్ కు ఉండగా .. పాకిస్థాన్ కు కేవలం పహీన్ 2 సహా మరో రెండు ఉన్నాయి. అణుబాంబుల విషయంలో మాత్రం భారత్ తో పాకిస్థాన్ దాదాపు సమానస్థాయిలో ఉంది. భారత్ వద్ద 130 నుంచి 140 ఉండగా .. పాకిస్థాన్ లో 140 నుంచి 150 వరకు ఉన్నాయి. భారత్ వద్ద యుద్ద ట్యాంకులు కూడా 3 వేల 565 వరకు ఉన్నాయి. పాకిస్థాన్ 2 వేల 496 వరకు సమకూర్చుకుంది. యుద్ధ విమానాలు కూడా భారత్ వద్ద ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ఎయిర్ బేస్ లో 814 విమానాలు యుద్ధం కోసం సన్నద్దమవుతోన్నాయి. పాకిస్థాన్ లో మాత్రం 425 యుద్ద విమానాలు ఉన్నాయి. ఇటీవల పాక్ పై మిరాజ్ యుద్ధ విమానాల దాడితో ఆ దేశ కళ్లు బైర్లు కమ్మి ఉంటాయి. అలాగే పాకిస్థాన్ కు లేని విమాన వాహక నౌక మనకు ఉంది. ఒక్క వాహక నౌకతో ఆ దేశాన్ని తునతునకాలు చేయొచ్చు. ఇక జలాంతర్గాములు కూడా మన వద్ద రెట్టింపు ఉన్నాయి. పాకిస్థాన్ లో 8 ఉండగా మన వద్ద 16 ఉన్నాయి.

English summary
India and Pakistan jet fighters are on the borders of the demolition borders. What is going on? Has the tension in the boundaries decreased? In the face of the current situation, the issue of India, Pakistan's power and competence has begun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X