వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌‌ హ్యాక్... పాకిస్తానీ హ్యాకర్ల పనే...

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్‌కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్న కథనాలు వస్తున్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున హ్యాక్‌కి గురైన ఈ వెబ్‌సైట్‌లో కశ్మీర్ విముక్తి,పాకిస్తాన్ తదితర అంశాలతో పాటు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు కొన్ని సందేశాలను ఉంచారు.

వెబ్‌సైట్ హ్యాక్‌కి గురైన విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌పై 'temporarily unavailable' అన్న సందేశం కనిపిస్తోంది. దీని వెనక అసలు కారణాలను వెతికేందుకు సాంకేతిక నిపుణలు ప్రయత్నిస్తున్నారు.

Pakistan hackers target personal website of union minister Kishan Reddy

భారత్‌ లేదా భారత పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందులో లేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన డేటా కూడా అందులో ఏమీ లేదన్నారు. కేవలం కేంద్రమంత్రి వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని చెప్పారు.

English summary
The personal website of minister of state (home) G Kishan Reddy -- kishanreddy.com -- was targeted by self-claimed Pakistani hackers. The website was hacked on Independence Day and the hackers had put messages related to Free Kashmir, Pakistan, and also warned the Government of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X