పాక్‌కు న్యూ ఇయర్ షాక్: ఫూల్స్ చేశారంటూ ట్రంప్ ఫైర్, తీవ్ర హెచ్చరిక

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: కొత్త ఏడాది తొలిరోజే పాకిస్థాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అంతేగాక, నిధుల కోసం ఆ దేశం అబద్ధాలు చెప్పి.. మోసం చేసిందని ఆరోపించారు.

పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ పాక్‌ తీరుపై ధ్వజమెత్తారు. అంతేగాక, తమ దేశం ఇస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు తేల్చి చెప్పారు.

ఫూల్స్ చేశారనుకుంటున్నారు..

ఫూల్స్ చేశారనుకుంటున్నారు..

‘గత 15ఏళ్ల నుంచి పాకిస్థాన్‌కు అమెరికా తెలివితక్కువగా.. దాదాపు 33 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు ఇచ్చింది. కానీ వాళ్లు మాత్రం మమ్మల్ని మోసం చేస్తూ అబద్ధాలు చెప్పారు. వాళ్లు మా నేతలను ఫూల్స్‌ అనుకుంటున్నారు' అని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.

 ఆటలు సాగవు

ఆటలు సాగవు

అంతేగాక, ‘పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉంది. ఇక ఆ ఆటలు సాగబోవు' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇక పాకిస్థాన్ కు ఆర్థిక సాయముండదని తేల్చి చెప్పారు.

 ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా..

ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా..

గతంలో కూడా పలుమార్లు ట్రంప్‌ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందంటూ ఆగస్టులో వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలపై పాక్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే.. ఆ దేశం అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తందని ట్రంప్‌ హెచ్చరించారు. అయినా పాక్ తన వైఖరి మార్చుకోకపోవడంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఆర్థిక సాయం అందబోదు..

ఆర్థిక సాయం అందబోదు..

తామిచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే పాక్‌కు అమెరికా నుంచి అందే 255 మిలియన్‌ డాలర్ల సాయాన్ని నిలిపేయాలని భావిస్తున్న తరుణంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వీటిని బట్టి చూస్తే ఇక పాక్‌కు యూఎస్‌ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందబోదని స్పష్టమవుతోంది.

పాక్ స్పందన

పాక్ స్పందన

కాగా, ట్రంప్ ప్రకటనపై పాకిస్థాన్ స్పందించింది. ప్రపంచానికి నిజా నిజాలు తెలుసునని పాక్ పేర్కొంది. అంతేగాక, పాక్ ప్రధాని షహీద్ అబ్బాసి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి, ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Coming down heavily on Pakistan, US President Donald Trump on Monday said that America got only lies and deceit from Islamabad in retun for billion in aid.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి