జమ్మూకశ్మీర్లో తొలిసారి ఓటేయబోతున్న పాకిస్తాన్ హిందువులు..!
జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండో దశకు చేరుకుంది. ఇప్పటికే 17న తొలి దశ పోలింగ్ పూర్తి కాగా.. రేపు రెండో విడత పోలింగ్ జరగబోతోంది. వచ్చే నెల 1న మూడో విడత పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో చాలా అంశాలు తొలిసారి జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 తర్వాత చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల్ని దేశం ఆసక్తిగా గమనిస్తోంది.
ఇందులో ప్రధానంగా తొలిసారి పాకిస్థానీ హిందువులు జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్నారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా భారత్ లోకి వచ్చిన హిందూ శరణార్థి కుటుంబాలు ఈసారి పోలింగ్ లో పాల్గొంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత వీరికి తొలిసారి జమ్మూకశ్మీర్ లో ఓటు హక్కు లభించింది. దీంతో వీరు ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు. ఇప్పుడు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు.

1947లో పశ్చిమ పంజాబ్ నుంచి పాకిస్తాన్ కు వలస వెళ్లిపోయిన వీరంతా ఆర్టికల్ 370 తర్వాత తిరిగి కాశ్మీర్ కు శరణార్థులుగా తిరిగి వచ్చారు. వీరు దాదాపు 20 వేల కుటుంబాల వరకూ ఉన్నారు. అంతే కాదు ఇక్కడ ఓటు హక్కు కూడా తీసుకుని ఇప్పడు ఓటేయబోతున్నారు. ఇతర దేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను దేశంలోకి శరణార్థులుగా తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వీరంతా జమ్మూకశ్మీర్ కు వచ్చి ఓటర్లుగా మారిపోయారు. వీరంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications