వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి పాక్ జాతీయురాలు రాఖీ.. 20 ఏళ్లుగా రాఖీ పంపిస్తూ..

|
Google Oneindia TeluguNews

రాఖీ పౌర్ణమి.. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం చాటుతుంది. ప్రముఖులకు రాఖీ కట్టేందుకు అతివలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా ప్రధాని మోడీకి రాఖీని పాకిస్థాన్‌కు చెందిన మహిళ ఖమర్ మొహిసిన్ షేక్ కడుతున్నారు. ఈ ఒక్కసారే కాదు.. గత 20 ఏళ్ల నుంచి ఆమె రాఖీ పంపిస్తున్నారు. ఈ నెల 11న రక్షాబంధన్ పండుగ కాగా, ఖమర్ మొహిసిన్ మోడీకి రాఖీ పంపారు.

 pakistan nation women send rakhi to pm modi

పాక్ జాతీయురాలు అయిన ఖమర్ పెళ్లి తర్వాత అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. ఆమె మోడీని తన సోదరుడిగా భావిస్తారు. ఈసారి ఆమె స్వయంగా రూపొందించిన రాఖీని పంపించడం విశేషం. రేష్మీ రిబ్బన్ పై ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఆ రాఖీతోపాటు ఖమర్ ఓ లేఖను కూడా మోడీకి పంపారు. తనను ఈసారి మోడీ ఆహ్వానిస్తారని భావిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోడీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

రాఖీ పండగ పల్లెల్లో మొదలైంది. పెళ్ళయ్యాక ఆడపిల్లలు భర్త ఇంటికి వెళ్తారు. ప్రత్యేకమైన రోజున అమ్మ వాళ్ళింటికి వస్తుంటారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధం ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్ళినా కూడా అంతే బలంగా ఉండాలన్న లక్ష్యంతో పండగ జరుపుకుంటారు. ఈ రోజున అక్కలు, చెల్లెల్లు తమ అన్నా తమ్ముళ్ళకు రాఖీ కడతారు. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్ళకు బహుమతిగా అన్నాదమ్ములు ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది.

English summary
pakistan nation women send rakhi to prime minister narendra modi. she has send rakhi to last 20 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X