భర్త ఆచూకీ కోసం దేశాలన్నీ తిరిగి, చివరికిలా...
తిరువనంతపురం :దేశం కాని దేశంలో తనను వివాహం చేసుకొని వదిలేసిన భర్త ఆచూకీని తెలుసుకొని ..ఆయనతో సుదీర్ఘన్యాయపోరాటం చేసి భారీ భరణం పొందింది ఓ వివాహిత. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది.
కేరళలొని మలప్పురం జిల్లాలోని చవక్కడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి లండన్ లో ఎంబిఏ చదివేవాడు. అప్పల్లో పాకిస్థాన్ కు చెందిన బ్రిటిష్ మహిళ అక్కడే సేల్స్ ఆఫీసర్ గా పనిచేసేది. దీంతో అతను ఆమెతో స్నేహం పెంచుకొన్నాడు.
పెళ్ళి చేసుకొని ముఖం చాటేశాడు
2013 ఏప్రిల్ లో అతను ఆమెను వివాహం చేసుకొన్నాడు. ఏడాది తర్వాత ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి కేరళలో మళ్ళీ పెళ్లి చేసుకొందామని ఆ తర్వాతే తన ఇంటికి తీసుకెళ్తానని యూకె వదిలివెళ్ళిపోయాడు.తొలుత కొన్నాళ్ళపాటు ఆమెకు ఫోన్ చేసేవాడు , తర్వాత ఫోన్లు ఆగిపోయాయి. కొంతకాలం తర్వాత తన తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదని తాను యూకె రావడం లేదని ఓ లేఖ రాశాడు.

అయితే తన భర్త గురించిన ఆధారాలేమీ లేకపోవడంతో ఆమె 2015 లో తన పెళ్ళి ఆల్బమ్ తీసుకొని మలప్పురం వచ్చింది. ఆమె పాకిస్తాన్ కు చెందింది కావడంతో పోలీసులు కూడ సహకరించలేదు.
బాధితురాలు కష్టాలు తెలుసుకొన్న స్నేహిత అనే స్వచ్చందసంస్థ ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి రెండో పెళ్ళికి సిద్దమౌతున్నట్టు తెలిసి ఆమె కోర్టును ఆశ్రయించింది.
అయితే బాధితురాలిని భర్త కుటుంబసభ్యులు బెదిరించినా ఆమె భయపడలేదు. చివరకు ఇంగ్లాండ్ లో ఉండేందుకు సరిపోయేలా ఒకేసారి భరణం ఇచ్చేందుకు భర్త అంగీకరించడంతో ఆమె ఒప్పుకొంది.తాను కేవలం డబ్బు కోసం ఈ కేసు వేయలేదని, తన భర్తకు గుణపాఠం చెప్పేందుకే కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు.
దేశం కాని దేశంలో తనను వివాహం చేసుకొని వదిలేసిన భర్త ఆచూకీని తెలుసుకొని ..ఆయనతో సుదీర్ఘన్యాయపోరాటం చేసి భారీ భరణం పొందింది ఓ వివాహిత. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొంది.












Click it and Unblock the Notifications